Sunday, March 18, 2012
కోవూరు స్థానాన్ని వైఎస్సార్ సీపీనే కైవశం : కాకాణి
కోవూరు ఉప ఎన్నికల్లో మహిళలు, యువకులు, రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంఘీభావం ప్రకటించి భారీ సంఖ్యలో పోలింగ్‌కు హాజరయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆదివారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అత్యధిక ఆధిక్యంతో కోవూరు స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంటుందని ఆయన ధీమాగా చెప్పారు. కాంగ్రెస్, టీడీపీలు పన్నిన కుయుక్తులు, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలనే భావోద్వేగం ఓటర్లను పోలింగ్ బూత్‌ల వైపు నడిపించిందని ఆయన తెలిపారు.
Thursday, March 1, 2012
మంత్రి ఆనంపై వైఎస్‌ఆర్‌సి నేతలు ఫైర్
అసెంబ్లీలో ఆనం వ్యాఖ్యలు అర్థరహితం
కలేజా ఉంటే అన్న రాజాపై పోటీకీ రా...
రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌పై జరుగుతున్న చర్చలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ చేసిన ప్రసంగం అనంతరం పుత్రవాత్సల్యంతో కొడుకును వెనుకేసుకుని రావడం దురదృష్టకరమని విజయమ్మపై ఆనం రామనారాయణరెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆనంపై ఫైర్ అయ్యారు. గురువారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డి దయాభిక్షతో పదవులు అనుభవించే మీరు విజయమ్మపై విమర్శలు చేయడం ఎంతవరకు సబబని ఒక్కసారి మీ అంతరాత్మను ప్రశ్నించుకోవాలన్నారు. మీరు, మీ బిడ్డ వైఎస్‌ను బజారుకు ఈడుస్తున్నారని మంత్రి చేసిన ప్రసంగాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి రంగ ప్రవేశం చేసిన మీరు వైఎస్‌ను, విజయమ్మను విమర్శించే అర్హత మీకుందా? అని ఆయన ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ లేకుంటే నీకు రాజకీయ చరిత్రే ఉండేది కాదన్నారు. నీ ప్రసంగం క్షమించరాని నేరమన్నారు. వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా విజయమ్మకు, జగన్‌కాడ కాళ్లు మొక్కుతూ నేడు విమర్శించడం మీ కుటుంబానికే తగునన్నారు. నమ్ముకున్నవారిని నట్టేట ముంచడం ఆనం వారికి అలవాటేనన్నారు. వైఎస్‌ఆర్ పుణ్యంతో 2004, 2009లో గెలిచి కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. అసలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారో లేదోనని మీపై ప్రజలు చర్చలు మొద లు పెట్టారన్నారు. ముఖ్యమంత్రి అవుతాన నే భ్రమల్లో వైఎస్ కుటుంబంపై అలా మాట్లాడుతున్నారని కాకాణి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనంతరం మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఇతను మనిషి కాదని, అసలు మంత్రే కాదని ప్రజలు అంటున్నారన్నారు. జగన్ వైఎస్‌ను మించిన నేత అవుతారని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తన వయసు వున్నవారిలో ఉండేవారికన్నా గొప్ప నేత అవుతారని, దేశంలోని యువ నాయకులంతా అదే మాట అంటున్నారన్నారు. పుత్రవాత్సల్యం గురించి మాట్లాడే అర్హత మంత్రికి లేదన్నారు. ‘నీకు కలేజా వుంటే మా అన్న రాజీనామా చేశారు. ఆయన మీద పోటీకి రా... చూసుకుందాం...’ అని సవాల్ విసిరారు. ఇలాంటి దగా కోరు మంత్రి ఏ జిల్లాలో లేరన్నారు. రోశయ్య కాళ్లు, కిరణ్ కాళ్లు ఇప్పుడు బొత్సా కాళ్లు పట్టుకుంటున్నావు. ఇంకెందరి కాళ్లు పట్టుకుంటావో నీకే తెలియాని హేళన చేశారు. విజయమ్మ కంటతడి పెడితే నాశనమవుతావు... అని శాపనార్థాలు పెట్టారు. శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ జగన్ కాకుండా వైఎస్‌ఆర్‌కు ఎలాంటి కొడుకు పుట్టాలి. మీలాంటి కొడుకు పుట్టాలా? అంటూ సినిమాహాళ్లలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన మీ బిడ్డలాగా పుట్టాలా? సెల్‌ఫోన్ దొంగతనం చేస్తే సిసి.కెమెరా చిత్రీకరిస్తే వాళ్ల కాళ్లు పట్టుకున్న చరిత్ర నీది కాదా? ఇలాంటి బిడ్డ వైఎస్‌ఆర్‌కు పుట్టాలా? అంటూ మంత్రి రామనారాయణరెడ్డిపై శ్రీధర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు.

Subscribe to:
Posts (Atom)