Thursday, June 9, 2011
చరిత్ర హీనులు ఆనం సోదరులు కాకాణి, మేకపాటి ధ్వజం
మంత్రులుగా ప్రజాప్రతినిథులుగా జిల్లా అభివృద్ధికి కృషి చేయాల్సిన ఆనం సోదరులు అందుకు భిన్నంగా వ్యవహరించి ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని జడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధనరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా ప్రగతి నిరోధకులుగా మారిన ఆనం సోదరులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. గురువారం మేకపాటి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జడ్పీ చైర్మన్ కాకాణి మాట్లాడుతూ ఆర్ధిక శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారని ఆరోపించారు. అధికారులను భయపెట్టి వైఎస్సార్ పార్టీ అధినేత జగన్ మద్దతుదారులు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకుండా అడ్డుకుంటున్నారన్నారు. జగన్ వర్గానికి చెందిన ప్రజాప్రతినిథులను లక్ష్యం పెట్టొద్దని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఆనం సోదరులిద్దరూ ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలను, మొదలయిన పనులకు నిధుల విడుదలను అడ్డుకుంటున్నారన్నారు. ఇప్పటి వరకు సహనంతో వ్యవహరించామని ఇక ముందు కూడా ఇదే ధోరణితో వ్యవహరిస్తే అధికారులను కూడా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని ఈ ధోరణులకు అడ్డుకట్ట వేయాలన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల తీరుతెన్నులు అధికారులు వ్యవహరిస్తున్న తీరును సమీక్షించాలన్నారు. ప్రజాప్రతినిథుల రాజకీయ చదరంగంలో అధికారులు నలిగిపోకూడదనే భావనతో ఉన్నామని ఇక నుంచైనా నిస్పక్షపాతంగా వ్యవహరించి అభివృద్ధికి దోహదపడాలని కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment