సోనియాగాంధీ అధికార దాహానికి మంత్రులను బలి పశువులను చేస్తోందని కాకాణి విమర్శించారు. పొదలకూరు పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణించిన తర్వాత కూడా ఆయన పేరును సీబీఐ చార్జిషీట్‌లో చేర్చడం దారుణమన్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక సీబీఐని పావుగా వాడుకుని కాంగ్రెస్ పెద్దలు నేరం రుజువు కాక మునుపే అరె స్ట్ చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం గొప్పదని చెప్పుకోవడానికి జగన్ కంటే ముందుగా బీసీ కులానికి చెందిన మంత్రి మోపిదేవిని అరెస్ట్ చేసి బలి చేశారన్నారు. 26 జీవోల్లో బాధ్యులైన మంత్రులకు నోటీసులు జారీ చేయడంతో ప్రభుత్వం ఇరుకున పడిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ తన మెడకు తానే ఉరి వేసుకుందన్నారు. వీడీబీ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం కడప, నెల్లూరు జిల్లాల రైతులకు బకాయిలు వెంటనే చెల్లించాలని, లేకపోతే రైతులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కోనం బ్రహ్మయ్య, పార్టీ నాయకులు డేగా జయరామయ్య, యువరాజు, వాకాటి శ్రీనివాసులురెడ్డి, బూసుపల్లి నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment