కండలేరు జలాశయం నీటిని మెట్ట ప్రాంతాలకు ఎడమ కాలువ ద్వారా అందించిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మర్రిపల్లి, ఊట్లపాళెం గ్రామాల్లో గురువారం ఆయన పార్టీ నాయకులు,కార్యకర్తలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కండలేరు జలాశయం ద్వారా వచ్చే నీటిని మెట్ట ప్రాంతంలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే వైఎస్సార్ లక్ష్యమన్నారు.
ఇందులో భాగంగానే ఎడమ కాలువకు అప్పట్లో రూ.40 కోట్లు వెచ్చించి నీరు అందించారన్నారు. వైఎస్సార్ మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం పథకానికి తూట్లు పొడిచిందని విమర్శించారు. ఇప్పటికి 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. ఎత్తిపోతల పథకం పూర్తయితే మరో 25వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. పాలకులు ఎత్తిపోతల పథకాన్ని చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కలెక్టర్ సమస్యను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేయాలన్నారు. జలాశయంలో సమృద్ధిగా నీరు ఉన్నా, పొలాలకు అందించడానికి కెనాల్స్ లేక వేలాది ఎకరాల్లో నిమ్మపంట నిలువునా ఎండిపోతోందన్నారు.
No comments:
Post a Comment