Pages

Saturday, March 5, 2011

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించలేదు: కాకాణి

తాను ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని జిల్లా కాంగ్రెస్ ప్రతినిథులు కొందరు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడాన్ని జడ్పీ చైర్మన్ కాకాణి గోవర్దనరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎన్నికల నిబంధనలపై తనకు అవగాహన ఉందన్నారు. అంతకన్నా భారత రాజ్యాంగంపై తనకు గౌరవం ఉందన్నారు. దానిని అవహేళన చేయడానికి అధికార పార్టీ నేతలు ప్రయత్నం చేయడం విచారకరమన్నారు. ఎన్నికల ప్రక్రియతో ప్రమేయం ఉన్న అధికారులతో సమావేశాలు నిర్వహించడం, ఓటర్లను ప్రభావితం చేసే అధికారులతో సమీక్షలు జరపడం వంటి అంశాలు ఎన్నికల నిబంధనల పరిధిలోకి వస్తాయన్నారు. తాను పూర్తి అవగాహనతోనే వ్యవహరిస్తున్నానని తప్పుపట్టాలని చూడటాన్ని వారి విచక్షణకే వదిలేస్తున్నానన్నారు. ప్రస్తుతం శాసన సభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని వాటిని కూడా తప్పుపడతారా అని ఆయన ప్రశ్నించారు. జగన్ వర్గం బలాన్ని చూసి ఆందోళనతో అధికార పార్టీ ప్రజాప్రతినిథులు తమను ఇబ్బందులు పాలు చేయాలనే లక్ష్యంతో అడ్డదారు తొక్కుతున్నారన్నారు. అల్లూరు మండలంలో గురువారం రాత్రి జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్నికలను పారదర్శకంగా జరిపేందుకు సహకరించాల్సిన ప్రభుత్వ ప్రతినిథులే అధికార దుర్వినియోగానికి పాల్పడడం, భయాందోళనలు సృష్టించడం దారుణమన్నారు. శిబిరాలు నిర్వహించాల్సిన అవసరం తమకు లేదన్నారు. జగన్ వర్గం అభ్యర్ధికి ఓటేయాలని ప్రజాప్రతినిథులు భావిస్తుండగా వారికి ఓటేసిన ఓటర్లు మరింత వత్తిడి చేస్తున్నారన్నారు. అధికార పార్టీ నేతలు జగన్ వర్గం నేతలపై వత్తిడి చేయడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. తమకు స్పష్టమైన మెజారిటీ ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థితోనే తమ పోటీ ఉంటుందన్నారు. అత్యిధిక మెజారిటీతో ప్రతాప్‌కుమార్‌రెడ్డి గెలవడం ఖాయమన్నారు

No comments:

Post a Comment