రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు పరిపాలనపై దృష్టి పెట్టకుండా ఆయా ప్రాంతాల ప్రత్యేకత కోసం రాష్ట్రాన్ని వదిలి బయట ఉండడంతో పరిపాలన కుంటుపడిందని, తద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేడో రేపో కుప్పకూలడం ఖాయమనే సందేహం కలుగుతుందని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక జడ్పీ కార్యాలయం ఆవరణంలో జరిగిన జడ్పీ ఛైర్మన్ ఐదేళ్ల పాలనపై అభినందన సభ జడ్పీ వైస్ ఛైర్మన్ టివిఎస్ రాజా అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా సభకు సన్మాన గ్రహీత హోదాలో హాజరైన జడ్పీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 46 మండలాల్లోని జడ్పీటిసి సభ్యులు ఐదేళ్లపాటు అందించిన సహాయ సహకారాల వల్లే సుపరిపాలనను అందించగలిగామన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు కూడా తమకు మంచి సహకారం అందించారని, తాను ఎన్నికైనప్పుడు వున్న ఎమ్మెల్యేలు, ప్రస్తుతం వున్న ఎమ్మెల్యేల సహకారానికి ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. తన ఐదేళ్ల పరిపాలనలో నెల్లూరు జిల్లా పరిషత్ రాష్ట్రానికే రోల్‌మోడల్‌గా నిలిచామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నుండి అధిక సంఖ్యలో నిధులు రాబట్టగలిగిన జిల్లా పరిషత్‌లలో నెల్లూరు ్రపథమ స్థానంలో ఉందన్నారు.
జిల్లాపరిషత్ హైస్కూల్‌లో చదువుకునే ప్రతిభ కలిగిన విద్యార్థులకు తన సొంత నిధులతో ప్రోత్సాహక బహుమతులను గత నాలుగేళ్లుగా అందించానని, ఇప్పుడు కూడా అందించి ప్రోత్సహిస్తామన్నారు. తనకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా తమ శాఖలో పనిచేసే 4వ తరగతి ఉద్యోగుల పిల్లలు అధిక శాతంలో ఉత్తీర్ణత అయితే వారికి ఉన్నత చదువుల కోసం అందించడం జరిగిందన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి నెల్లూరు జడ్పీకి అడిగిందే తడవుగా నిధులను విడుదల చేశారని, ఆయన చలువ వల్లే నేడు జిల్లా పరిషత్‌కు కొత్త భవనాన్ని నిర్మించుకున్నామన్నారు.
గడచిన ఐదేళ్ల కాలంలో ఇసుక రీచ్‌ల ద్వారా జిడ్పీకు రూ.60 కోట్లు ఆదాయాన్ని సమకూర్చామన్నారు. జిల్లాలో విద్య, వైద్య, క్రీడారంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అనేక ప్రజోపయోగ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. జడ్పీ ఛైర్మన్ కప్‌ను ప్రవేశపెట్టి గ్రామీణ క్రీడాకారుల్లో వున్న ప్రతిభను వెలికితీసి జాతీయ స్థాయికి ఎదిగేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు జడ్పీలో తిష్ట వేసి పరిపాలనను తమ చేతుల్లోకి తీసుకునే పద్ధతికి చెక్ పెట్టి స్థానిక సంస్థల అధికారాలు కేవలం జడ్పీటిసిల ద్వారానే జరిగేటట్లు చర్యలు తీసుకున్నామన్నారు.
జిల్లా పరిషత్ ఛైర్మన్ తనకు దివంగత నేత డాక్టర్ వైఎస్‌ఆర్ ఆశీస్సులతో జిల్లా పెట్టిన భిక్ష అని ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. చేతనైతే ప్రజలకు ఉపయోగపడే జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, అంతేకాని అభివృద్ధి నిరోధకాలుగా మారవద్దని పరోక్షంగా ఆనం సోదరులనుద్దేశించి అన్నారు. ఇప్పటివరకు రూ.118 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం కోటి రూపాయలతో ప్రారంభించబడిన జిల్లా పరిషత్ నూతన భవనాన్ని పూర్తి చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, మంత్రి బొత్సా సత్యనారాయణలను ఎన్నిసార్లు కలిసినా కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా భవన నిర్మాణం ముందుకు సాగేందుకు వీలు లేదని, నిధులు లేవని చెప్పడం ఆవేదన కలిగించిందన్నారు.
దీనివెనుక స్వార్థ రాజకీయ నాయకుల కుట్ర ఉందనే విషయం తేటతెల్లమవుతుందన్నారు. తన ఊపిరి ఉన్నంతవరకు ప్రజలతో మమేకమై ప్రజోపయోగ కార్యక్రమాలను పదవి ఉన్నా లేకున్నా చేస్తుంటానన్నారు. ఈ సన్మాన సభలో జిల్లాలోని జడ్పీటిసి సభ్యులు, ఎంపిపిలు, ఎంపిటిసిలు పాల్గొని రెండు రోజుల్లో పరిపాలనా కాలం ముగించుకోనున్న జిల్లా పరిషత్ ఛైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డిని గజమాలలతో ఘనంగా సన్మానించారు. కాకాణికి సన్మానం సందర్భంగా జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
Wednesday, July 20, 2011
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేడో రేపో కుప్పకూలడం ఖాయం
20 ఏళ్ల పాలనను ఐదేళ్లలో పూర్తి చేశాం
గత ఇరవై సంవత్సరాల జిల్లా పరిషత్ పరిపాలన చరిత్రలో తన ఐదేళ్ల పరిపాలనలోనే ప్రజలకు సుపరిపాలనను అందించామని జిల్లా పరిషత్‌ఛైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జరిగిన జిల్లా ప్రజాపరిషత్ సా్థూసంఘ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ తన ఐదేళ్ల పరిపాలనలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా స్వచ్ఛమైన, పరిపాలనను ప్రజలకు అందించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ పరిపాలన కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనలో పూర్తి సహాయ సహకారాలు అందించడంలో కార్యాలయం సిబ్బందితోపాటు జిల్లా అధికారుల బృందం పూర్తిగా సహకరించిందన్నారు.
ప్రజలందరి ఆదరాభిమానాలతో తన ఐదేళ్ల కాలంలో ఒక చిన్న మచ్చకూడా లేకుండా పరిపాలన అందించడం, అది ప్రజలు పెట్టిన భిక్ష అన్నారు. తన ఐదేళ్ల కాలంలో తాను చేసిన మంచి అభివృద్ధి కార్యక్రమాలను, తమ పనులను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియపరచడంలో జిల్లా మీడియా, పత్రికా రంగం చూపిన చొరవ ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా పలువురు జడ్పీ టిసి సభ్యులు ఛైర్మన్‌ను, ఆయన పరిపాలనను అభినందించారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జయరామయ్య మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఛైర్మన్ సుపరిపాలన అందించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారని, ప్రజలకు ఏ సమయాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలో తెలుసుకుని పూర్తి చేసిన ఘనత ఆనకే దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని పలువురు జిల్లా పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.

Tuesday, July 19, 2011
మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి!
మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి!
జడ్పీ వర్గాలకు చైర్మన్ వేడుకోలు...!
ఐదేళ్ళు సంతృప్తిగా పని చేశాననే భావిస్తున్నా... కేవలం ప్రభుత్వంపైనే ఆధార పడకుండా వీలైనన్ని మార్గాల్లో వనరులు సమీకరించి జిల్లా అభివృద్ధికి పని చేశా. ఈ పనివత్తిడిలో నా వ్యవహారశైలికి ఎవరి మనసులైనా నొచ్చుకుని ఉంటే మన్నించండి.. అని జడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధనరెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ దారిమళ్ళుతున్న ఇసుక ఆదాయాన్ని రాబట్టి జిల్లా అభివృద్ధికి మళ్లించడం తనకు ఎంతో సంతృప్తిని కలిగించిందన్నారు. ఇందుకు అధికారులు ప్రజాప్రతినిథులు అంతా సహకరించారని ఈ పరిణామాన్ని తాను ఎన్నడూ మరిచిపోలేనని పేర్కొన్నారు. అలాగే అన్ని వర్గాల వారికి అవసరమైన పనులు చేయగలిగానన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ప్రజాప్రతినిథులను అందరినీ పేరుపేరునా గుర్తు చేసుకున్నారు. జడ్పీ చైర్మన్‌గా తన ఐదేళ్ల ప్రస్థానంలో వారు తన చేదోడు వాదోడుగా నిలిచి సంఘటనలను మననం చేసుకున్నారు. జడ్పీని ఆర్థికంగా బలోపేతం చేయడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జనరల్ ఫండ్స్ విషయంలో తలెత్తిన ఆపోహలు తొలగించాల్సి ఉందన్నారు. తమ హయాంలో జరిగిన కృషి వల్ల జడ్పీ జనరల్ నిధుల్లో దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు మిగులు ఉన్నాయన్నారు. వీటిని వచ్చే ఏడాది జిల్లా అభివృద్ధికి సక్రమమైన రీతిలో ఖర్చయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా మూడు తీర్మానాలు చేశారు. విడవలూరు మండలంలోని అలగాని పాడు గ్రామంలోని పాఠశాలకు కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య పేరు పెట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇందుకు అధికారులు కృషి చేయాలని కోరుతూ తీర్మానం చేశారు. పాఠశాలకు పేరు పెట్టడానికి పది లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందని, అయితే ఆదర్శమూర్తి పేరు పెట్టడానికి అలాంటి లాంఛనాలు లేకుండా పని జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సమావేశం కోరింది. అలాగే ఐదేళ్ల పాటు పాలకవర్గానికి సహకరించిన అధికారులకు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక తీర్మానం, ప్రజాప్రతినిథులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మరో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా అమోదించారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ టివిఎస్ రాజా, సిఇవో జయరామయ్యతోపాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిథులు కూడా పాల్గొన్నారు.

Friday, July 1, 2011
నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే వ్యక్తుల్లో కాకాణి ఒకరు
చిన్న వయసులోనే జిల్లా పరిషత్ అధ్యక్ష స్థానాన్ని అధిరోహించి ఐదేళ్ల కాలంలో నిజాయితీ, నిబద్ధతతో పనిచేసి ప్రజాభిమానం చూరగోరిన వ్యక్తుల్లో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ అధ్యక్షులు కాకాణి గోవర్థన్‌రెడ్డి ఒకరని రాష్ట్ర ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్, సీనియర్ పాత్రికేయుడు పొత్తూరు వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నెల్లూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఎపియుడబ్ల్యుజె అధ్యక్షులు ఎ.జయప్రకాష్ రచించిన దర్పణం పుస్తకావిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ సమాజంలో మంచి పనులు ఎవరు చేసినా అభినందించక తప్పదన్నారు.
జిల్లా పరిషత్ ఛైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ల కాలంలో ఇంతటి ప్రజాభిమానాన్ని పొంది, ప్రజాభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడంలో సహకరించిన సహచర జడ్పీటిసిలు, సహాయం అందించిన అధికారులకు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. పదవిని చేపట్టే సమయంలో ప్రకటించిన వాటిలో 80 శాతం పనులను పూర్తి చేయడంలో సహకరించిన ప్రతిఒక్కరికీ కృతఙ్ఞతలు తెలిపారు. అనంతరం పుస్తక రచయిత ఎ.జయప్రకాష్‌ను ఘనంగా సన్మానించారు.

Subscribe to:
Posts (Atom)