చిన్న వయసులోనే జిల్లా పరిషత్ అధ్యక్ష స్థానాన్ని అధిరోహించి ఐదేళ్ల కాలంలో నిజాయితీ, నిబద్ధతతో పనిచేసి ప్రజాభిమానం చూరగోరిన వ్యక్తుల్లో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ అధ్యక్షులు కాకాణి గోవర్థన్‌రెడ్డి ఒకరని రాష్ట్ర ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్, సీనియర్ పాత్రికేయుడు పొత్తూరు వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నెల్లూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఎపియుడబ్ల్యుజె అధ్యక్షులు ఎ.జయప్రకాష్ రచించిన దర్పణం పుస్తకావిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ సమాజంలో మంచి పనులు ఎవరు చేసినా అభినందించక తప్పదన్నారు.
జిల్లా పరిషత్ ఛైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ల కాలంలో ఇంతటి ప్రజాభిమానాన్ని పొంది, ప్రజాభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడంలో సహకరించిన సహచర జడ్పీటిసిలు, సహాయం అందించిన అధికారులకు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. పదవిని చేపట్టే సమయంలో ప్రకటించిన వాటిలో 80 శాతం పనులను పూర్తి చేయడంలో సహకరించిన ప్రతిఒక్కరికీ కృతఙ్ఞతలు తెలిపారు. అనంతరం పుస్తక రచయిత ఎ.జయప్రకాష్‌ను ఘనంగా సన్మానించారు.
No comments:
Post a Comment