Pages

Wednesday, July 20, 2011

20 ఏళ్ల పాలనను ఐదేళ్లలో పూర్తి చేశాం

గత ఇరవై సంవత్సరాల జిల్లా పరిషత్‌ పరిపాలన చరిత్రలో తన ఐదేళ్ల పరిపాలనలోనే ప్రజలకు సుపరిపాలనను అందించామని జిల్లా పరిషత్‌ఛైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశం మందిరంలో జరిగిన జిల్లా ప్రజాపరిషత్‌ సా్థూసంఘ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ తన ఐదేళ్ల పరిపాలనలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా స్వచ్ఛమైన, పరిపాలనను ప్రజలకు అందించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ పరిపాలన కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనలో పూర్తి సహాయ సహకారాలు అందించడంలో కార్యాలయం సిబ్బందితోపాటు జిల్లా అధికారుల బృందం పూర్తిగా సహకరించిందన్నారు.

ప్రజలందరి ఆదరాభిమానాలతో తన ఐదేళ్ల కాలంలో ఒక చిన్న మచ్చకూడా లేకుండా పరిపాలన అందించడం, అది ప్రజలు పెట్టిన భిక్ష అన్నారు. తన ఐదేళ్ల కాలంలో తాను చేసిన మంచి అభివృద్ధి కార్యక్రమాలను, తమ పనులను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియపరచడంలో జిల్లా మీడియా, పత్రికా రంగం చూపిన చొరవ ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా పలువురు జడ్పీ టిసి సభ్యులు ఛైర్మన్‌ను, ఆయన పరిపాలనను అభినందించారు. జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి జయరామయ్య మాట్లాడుతూ జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ సుపరిపాలన అందించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారని, ప్రజలకు ఏ సమయాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలో తెలుసుకుని పూర్తి చేసిన ఘనత ఆనకే దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని పలువురు జిల్లా పరిషత్‌ సభ్యులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment