Pages

Friday, August 24, 2012

Friday, August 17, 2012

నూతన వధూవరులకు కాకాణి ఆశీర్వాదం


' బొగ్గల కుటుంబానికి కాకాణి పరామర్శ'


సోనియా అధికార దాహానికి మంత్రులు బలి

సోనియాగాంధీ అధికార దాహానికి మంత్రులను బలి పశువులను చేస్తోందని కాకాణి విమర్శించారు. పొదలకూరు పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణించిన తర్వాత కూడా ఆయన పేరును సీబీఐ చార్జిషీట్‌లో చేర్చడం దారుణమన్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక సీబీఐని పావుగా వాడుకుని కాంగ్రెస్ పెద్దలు నేరం రుజువు కాక మునుపే అరె స్ట్ చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం గొప్పదని చెప్పుకోవడానికి జగన్ కంటే ముందుగా బీసీ కులానికి చెందిన మంత్రి మోపిదేవిని అరెస్ట్ చేసి బలి చేశారన్నారు. 26 జీవోల్లో బాధ్యులైన మంత్రులకు నోటీసులు జారీ చేయడంతో ప్రభుత్వం ఇరుకున పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మెడకు తానే ఉరి వేసుకుందన్నారు. వీడీబీ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం కడప, నెల్లూరు జిల్లాల రైతులకు బకాయిలు వెంటనే చెల్లించాలని, లేకపోతే రైతులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కోనం బ్రహ్మయ్య, పార్టీ నాయకులు డేగా జయరామయ్య, యువరాజు, వాకాటి శ్రీనివాసులురెడ్డి, బూసుపల్లి నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సాగునీరు అందించిన ఘనత వైఎస్సార్‌దే : కాకాణి

కండలేరు జలాశయం నీటిని మెట్ట ప్రాంతాలకు ఎడమ కాలువ ద్వారా అందించిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మర్రిపల్లి, ఊట్లపాళెం గ్రామాల్లో గురువారం ఆయన పార్టీ నాయకులు,కార్యకర్తలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కండలేరు జలాశయం ద్వారా వచ్చే నీటిని మెట్ట ప్రాంతంలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే వైఎస్సార్ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగానే ఎడమ కాలువకు అప్పట్లో రూ.40 కోట్లు వెచ్చించి నీరు అందించారన్నారు. వైఎస్సార్ మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం పథకానికి తూట్లు పొడిచిందని విమర్శించారు. ఇప్పటికి 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. ఎత్తిపోతల పథకం పూర్తయితే మరో 25వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. పాలకులు ఎత్తిపోతల పథకాన్ని చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కలెక్టర్ సమస్యను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేయాలన్నారు. జలాశయంలో సమృద్ధిగా నీరు ఉన్నా, పొలాలకు అందించడానికి కెనాల్స్ లేక వేలాది ఎకరాల్లో నిమ్మపంట నిలువునా ఎండిపోతోందన్నారు.

ఎతిపోతలతో సాగునీరు : కాకాణి


పేరులో తప్ప ప్రవర్తనలో వివేకం లేదు...


Tuesday, April 10, 2012

కాంగ్రెస్ కు జనమే బుద్ధి చెబుతారు: కాకాని

ఇచ్చిన హామీలను నెరవేర్చని దద్దమ్మ పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు జిల్లా కన్వీనర్‌ కాకాని గోవర్థన్‌ రెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్‌ రెక్కల కష్టం మీద గెలిచిన ఈ ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఆయననే విమర్శించాలని నిర్ణయించడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్‌ నేతలకు జనమే బుద్ధి చెప్తారన్నారు. పిసిసి చీఫ్‌, సీఎం గొడవకు ఒక సిన్సియర్‌ అధికారి బలవ్వడం అన్యాయమన్నారు. కేంద్రం సీబీఐని, రాష్ట్రం ఏసీబీని ప్రత్యర్థులపై ప్రయోగించడం అన్యాయమన్నారు.

http://www.youtube.com/watch?v=Pdey3Y7A7tM

Sunday, March 18, 2012

కోవూరు స్థానాన్ని వైఎస్సార్ సీపీనే కైవశం : కాకాణి

కోవూరు ఉప ఎన్నికల్లో మహిళలు, యువకులు, రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంఘీభావం ప్రకటించి భారీ సంఖ్యలో పోలింగ్‌కు హాజరయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆదివారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అత్యధిక ఆధిక్యంతో కోవూరు స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంటుందని ఆయన ధీమాగా చెప్పారు. కాంగ్రెస్, టీడీపీలు పన్నిన కుయుక్తులు, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలనే భావోద్వేగం ఓటర్లను పోలింగ్ బూత్‌ల వైపు నడిపించిందని ఆయన తెలిపారు.

Thursday, March 1, 2012

మంత్రి ఆనంపై వైఎస్‌ఆర్‌సి నేతలు ఫైర్‌

అసెంబ్లీలో ఆనం వ్యాఖ్యలు అర్థరహితం
కలేజా ఉంటే అన్న రాజాపై పోటీకీ రా...


రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌పై జరుగుతున్న చర్చలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌.విజయమ్మ చేసిన ప్రసంగం అనంతరం పుత్రవాత్సల్యంతో కొడుకును వెనుకేసుకుని రావడం దురదృష్టకరమని విజయమ్మపై ఆనం రామనారాయణరెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆనంపై ఫైర్‌ అయ్యారు. గురువారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా కన్వీనర్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డి దయాభిక్షతో పదవులు అనుభవించే మీరు విజయమ్మపై విమర్శలు చేయడం ఎంతవరకు సబబని ఒక్కసారి మీ అంతరాత్మను ప్రశ్నించుకోవాలన్నారు. మీరు, మీ బిడ్డ వైఎస్‌ను బజారుకు ఈడుస్తున్నారని మంత్రి చేసిన ప్రసంగాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి రంగ ప్రవేశం చేసిన మీరు వైఎస్‌ను, విజయమ్మను విమర్శించే అర్హత మీకుందా? అని ఆయన ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ లేకుంటే నీకు రాజకీయ చరిత్రే ఉండేది కాదన్నారు. నీ ప్రసంగం క్షమించరాని నేరమన్నారు. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగా విజయమ్మకు, జగన్‌కాడ కాళ్లు మొక్కుతూ నేడు విమర్శించడం మీ కుటుంబానికే తగునన్నారు. నమ్ముకున్నవారిని నట్టేట ముంచడం ఆనం వారికి అలవాటేనన్నారు. వైఎస్‌ఆర్‌ పుణ్యంతో 2004, 2009లో గెలిచి కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. అసలు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతారో లేదోనని మీపై ప్రజలు చర్చలు మొద లు పెట్టారన్నారు. ముఖ్యమంత్రి అవుతాన నే భ్రమల్లో వైఎస్‌ కుటుంబంపై అలా మాట్లాడుతున్నారని కాకాణి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనంతరం మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఇతను మనిషి కాదని, అసలు మంత్రే కాదని ప్రజలు అంటున్నారన్నారు. జగన్‌ వైఎస్‌ను మించిన నేత అవుతారని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తన వయసు వున్నవారిలో ఉండేవారికన్నా గొప్ప నేత అవుతారని, దేశంలోని యువ నాయకులంతా అదే మాట అంటున్నారన్నారు. పుత్రవాత్సల్యం గురించి మాట్లాడే అర్హత మంత్రికి లేదన్నారు. ‘నీకు కలేజా వుంటే మా అన్న రాజీనామా చేశారు. ఆయన మీద పోటీకి రా... చూసుకుందాం...’ అని సవాల్‌ విసిరారు. ఇలాంటి దగా కోరు మంత్రి ఏ జిల్లాలో లేరన్నారు. రోశయ్య కాళ్లు, కిరణ్‌ కాళ్లు ఇప్పుడు బొత్సా కాళ్లు పట్టుకుంటున్నావు. ఇంకెందరి కాళ్లు పట్టుకుంటావో నీకే తెలియాని హేళన చేశారు. విజయమ్మ కంటతడి పెడితే నాశనమవుతావు... అని శాపనార్థాలు పెట్టారు. శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌ కాకుండా వైఎస్‌ఆర్‌కు ఎలాంటి కొడుకు పుట్టాలి. మీలాంటి కొడుకు పుట్టాలా? అంటూ సినిమాహాళ్లలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన మీ బిడ్డలాగా పుట్టాలా? సెల్‌ఫోన్‌ దొంగతనం చేస్తే సిసి.కెమెరా చిత్రీకరిస్తే వాళ్ల కాళ్లు పట్టుకున్న చరిత్ర నీది కాదా? ఇలాంటి బిడ్డ వైఎస్‌ఆర్‌కు పుట్టాలా? అంటూ మంత్రి రామనారాయణరెడ్డిపై శ్రీధర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు.

Friday, January 13, 2012

సంక్రాంతి శుభాకాంక్షలు ...!


గోవర్ధనన్న అభిమానులన్దిరికి సంక్రాంతి శుభాకాంక్షలు ...!

Tuesday, January 3, 2012

వైఎస్ పథకాలకు మంగళం పాడి చరిత్ర హీనులు కావద్దు

కాంగ్రెస్ నేతలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్థన్ రెడ్డి హితవు



దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు మంగళం పాడి చరిత్ర హీనులుగా మిగలవద్దని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్థన్ రెడ్డి హితవు పలికారు. సోమవారం స్థానిక వైఎస్‌ఆర్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ వైఎస్‌ఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేసి, తద్వారా వైఎస్‌పై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చెరిపేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే వైఎస్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వైఎస్ బతికున్నప్పుడు బడ్జెట్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సుమారు 3200 కోట్ల రూపాయల నిధులను కేటాయించగా, ఈ ఏడాది విద్యా సంవత్సరానికి చెల్లించాల్సిన వాటిలో సుమారు 2200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయన్నారు. మరో మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో చెల్లించాల్సిన బకాయిల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. దీని వలన అనేక మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఈ పరిణామాలతో రాష్ట్రంలో అనేక చోట్ల విద్యార్థులు అవమాన భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని చెవిటి ప్రభుత్వంగా తయారైందన్నారు. ఈ పరిస్థితుల్లో బాధ్యతగల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి జనవరి 4వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా చేపడుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అన్ని ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ, జూనియర్ కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని కోరారు