ఏ హోదాలో ఉన్నప్పటికీ జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తన పయనం సాగతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధనరెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్‌గా నియమితులైన తర్వాత హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వచ్చిన కాకాణికి ఆదివారం పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. అదే రోజు సాయంత్రం కాకాణి తన నివాసంలో పలువురు పార్టీ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గడచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జెడ్పీ చైర్మన్‌గా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలనను అందించామన్నారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్‌రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో..జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తాను మహానేత వైఎస్సార్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచానన్నారు. మొట్టమొదటగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్‌గా తనకు బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
జిల్లాలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నాయకత్వంలో జిల్లాలోని అందరు నేతలు, కార్యకర్తలను కలుపుకుని గ్రామస్థాయి నుం చి పార్టీ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. జెడ్పీ చైర్మన్‌గా అధికారులతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేశానన్నారు. ఇకపై ఒక రాజకీయ పార్టీ జిల్లా సారథిగా ప్రజల సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగంతో గట్టిగా పోరాడుతానన్నారు. సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి ఉద్యమిస్తానని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో మనం చేయనిపని ఇతరులు చేయకూడదు అనే దురదృష్టకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని, తమ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు ఎవరు చేసినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కేవలం రాజకీయాల కోసం కాకుండా , పేదలకు మేలైన వ్యవస్థ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందన్నారు. జిల్లాలో కాంగ్రెస్, టీడీపీల పని అయిపోయిందని, రాబోయే రోజులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్డీవేనని ఆయన పేర్కొన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయనకుమారుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కానీ ప్రజలలోంచి పుట్టుకువచ్చిన నేతలని కాకాణి పేర్కొన్నారు. ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, జిల్లాలో ఏ ఎన్నికలు వచ్చినా తమ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, సీనియర్ నేత నేదురుమల్లి పద్మనాభరెడ్డి, మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, చిల్లకూరు సుధీర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ప్రవీణ్‌కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ నగళ్ల శ్రీనివాసులు, జెడ్పీటీసీ సభ్యులు వీరి చలపతి, భాస్కర్‌గౌడ్, వెంకయ్య, పాంగు రంగయాదవ్, రమణయ్య, శ్రీనివాసులు, మేకల లక్ష్మి, చిరంజీవిరెడ్డి మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్‌గా కాకాణిని నియమించడం పార్టీ విజయంలో తొలి అడుగుగా వారు అభివర్ణించారు. నిబద్ధత, నిజాయితీ కలిగిన నేత కాకాణి నాయత్వంలో పార్టీ విజయపథాన నడుస్తుం దనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తామందరం అయనకు సహకరించి పార్టీ అభివృద్ధికి పాటుపడతామన్నారు. జిల్లాలో ఎప్పుడు ఎన్ని కలు జరిగినా 10 అసెంబ్లీ స్థానాలనూ తమ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు గల్లంతవడం ఖాయమని జోస్యం చెప్పారు.
Sunday, May 29, 2011
కాంగ్రెస్‌కు కొమ్ము కాస్తున్న టీడీపీ
తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, జడ్పీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడ అధికారంలోకి వస్తారోనని టీడీపీ కాంగ్రెస్‌కు కొమ్ము కాస్తుందన్నారు. అధికారం ఉన్నా, లేకున్నా జనం నుంచి ఎదిగిన వ్యక్తి జగన్ అన్నారు. దివంగత నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి రెక్కల కష్టంతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము కూల్చబోమన్నారు. వైఎస్. రాజశేఖర్‌రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని, వాటిని అన్నింటినీ అమలు చేసేది ఒక్క జగనేనన్నారు.
అయితే టీడీపీ దుష్ర్పచారానికి నాంది పలుకుతుందన్నారు. అలాగే డొంక తిరుగుడు సమాధానాలు ఇస్తున్నట్లు ఆయన దుయ్యపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వానిది మొండి వాదమని ఆయన విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో తమ పార్టీ అభ్యర్థి ఓడిపోయారని, అయితే తెలుగుదేశం పార్టీ ఉనికిని కోల్పోయిందని ఆయన విమర్శించారు. తాను అధికార ంలో ఉన్నా, లేకపోయినా ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడతానన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వానికి అధికారులు కొమ్ము కాసిన వారి మెడలు వంచుతామని హెచ్చరించారు. రైతు సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్‌గా నియమించిన పార్టీ అధ్యక్షునికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరినీ సమన్వయపరచుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. కావలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాకాణి నాయకత్వంలో అందరం పని చేస్తామన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. జిల్లా గ్రంధాలయ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాకాణి మచ్చలేని వ్యక్తి అని, జడ్పీ ఛైర్మన్‌గా తన పదవీ కాలంలో ఎంతో అభివృద్ధి చేశారని ఆయన కొనియాడారు.
నేదురుమల్లి పద్మనాభరెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మనుషులు కరువయ్యే అవకాశం ఉందని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టిన కాకాణి గోవర్థన్‌రెడ్డిని ఆయన నివాసంలో పుష్పగుచ్ఛాలు, కండువాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం, సుధీర్‌రెడ్డి, చిల్లకూరు జడ్పీటిసి లక్ష్మి, విడవలూరు, కలిగిరి జడ్పీటిసిలు వీరి చలపతి, మెట్టుకూరు చిరంజీవిరెడ్డి, జడ్పీటిసి గోగుల వెంకయ్య, టిపి.గూడూరు ఎంపిపి శ్రీనివాసులురెడ్డి, కావలి మాజీ మున్సిపల్ ఛైర్మన్ నగ ళ్ల శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.
కాకాణి ఎంపికపై ఉప్పొంగిన ఆనందం
కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్‌హాక్ కమిటీ జిల్లా కన్వీనర్‌గా జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి నియమితులు కావడంపై ఆయన స్వగ్రామమైన పొదలకూరు మండలం తోడేరు గ్రామస్తుల్లో ఆనందం తొణికిసలాడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కోసం వినూత్నమైన కార్యక్రమాలను కాకా ణి చేపట్టారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత కలిగిన నాయకుడిగా ఎదుగుతున్న గోవర్ధన్‌రెడ్డి రాబోయే రోజుల్లో తమ గ్రామానికి మరిన్ని మంచి పనులు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తోడేరులో కాకాణి సేవలు
రూ. 10 లక్షలతో పశువైద్యశాల,
రూ. 40 లక్షలతో జెడ్పీ హైస్కూల్,
రూ. 5 లక్షలతో మహిళా భవనం,
రూ. 10 లక్షలతో తాగునీటి ఓవర్‌హెడ్ ట్యాంకు,
రూ. 10 లక్షలతో రామమందిరం,
రూ. 14 లక్షలతో నాలుగు అంగన్‌వాడీ భవనాలు,
రూ. 8 లక్షలతో రెండు కమ్యూనిటీ భవనాలు,
రూ. 57 లక్షలతో తోడేరు-సంగం తారురోడ్డు,
రూ. కోటి 30 లక్షలతో తోడేరు-మరుపూరు రోడ్డు,
రూ. 80 లక్షలతో తోడేరు-ఉప్పుటూరు రోడ్డు,
పంచాయతీ పరిధిలోని తోడేరు, శాంతినగర్, రత్నగిరి, గిరిజనకాలనీల్లో 50 సిమెంట్ రోడ్లు,
రూ. 5 లక్షలతో పార్కు.
మాకు ఆయనే దేవుడు
మా గ్రామస్తులకు కంటికి కనిపించే దేవుడు గోవర్ధన్‌రెడ్డి. మాకు కావాల్సిన పనులన్నీ చేసి పెట్టాడు. మా గ్రామంలో ఇన్ని వసతులు సమకూరుతాయని మేం ఊహించలేదు.
తిరుపాలు యాదవ్, మాజీ ఉప సర్పంచ్
అపారమైన గౌరవం
గోవర్ధన్‌రెడ్డి తండ్రి కాకాణి రమణారెడ్డి అంటే మాకు అపారమైన గౌరవం. జెడ్పీ చైర్మన్‌గా ఆయన ఉన్నప్పుడే నేను సర్పంచ్‌గా ఉండడం నా అదృష్టం.
ఏనుగు శశిధర్‌రెడ్డి, సర్పంచ్

Thursday, May 26, 2011
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పగ్గాలు కాకాణికే
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అడహాక్ కమిటీ కన్వీనర్‌గా జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర నేతలు గురువారం సాయంత్రం రాష్ట్ర రాజధానిలో ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడే సమయానికి కాకాణి హైదరాబాద్‌లోనే ఉన్నారు. కాకాణి నియామకంపై జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు బాణా సంచ పేల్చి, సంబరాలు జరుపుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో జెడ్పీ చైర్మన్ పదవిని అలంకరించిన కాకాణి గోవర్ధనరెడ్డి నిస్వార్థమైన సేవలందించి, జిల్లా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు.
జెడ్పీ చైర్మన్‌గా ఐదేళ్ల కాలంలో చక్కని పాలనను అందించి, అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందారు. ప్రధానంగా విద్య, వైద్యం, క్రీడలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పాటుపడ్డారు. స్థానిక సంస్థల బలోపేతం, హక్కుల సాధన కోసం కాకాణి పలు సందర్భాల్లో బలమైన వాణిని వినిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. సొంత నిధులు వెచ్చించి, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించి, సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో నిలిచారు. రాజకీయాల్లో ముక్కుసూటిగా వ్యవహరించే నేతగా పేరు పొందారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం, ఆయన కుమారుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెంట నిలిచారు. ఇటీవల జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడంలో కీలకపాత్ర పోషించారు.
కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్వస్థలం పొదలకూరు మండలం తోడేరు గ్రామం. ఆయన తండ్రి కాకాణి రమణారెడ్డి పొదలకూరు సమితి అధ్యక్షుడిగా 18 సంవత్సరాలపాటు పనిచేశారు. సివిల్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన గోవర్ధనరెడ్డి, తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఈ క్రమంలో 1999లో పీసీసీ సభ్యుడిగా నియమితులయ్యారు. రెండు పర్యాయాలు ఆ పదవిలో కొనసాగారు. 2006లో జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో సైదాపురం జెడ్పీటీసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే సమయంలోనే జెడ్పీచైర్మన్ పదవి ఆయన్ని వరించింది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్‌గా జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి నియమితులైన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పార్టీనేతలు, కార్యకర్తలు బాణాసంచ పేల్చి, సంబరాలు జరుపుకొని, ఆనందం వ్యక్తం చేశారు.
పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: కాకాణి
మహానేత వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా, పెద్దలు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నాయకత్వంలో జిల్లాలోని పార్టీ నేతలను, కార్యకర్తలను, అభిమానులను...అందరినీ సమన్వయ పరుచుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తా. స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, సాధారణ ఎన్నికలు కానీ..ఎప్పుడు వచ్చినా విజయదుంధుబి మోగించడానికి పార్టీని సన్నద్ధం చేస్తాం. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వార్డు స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు పాటుపడతాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్‌గా తనను నియమించినట్లు పార్టీ పెద్దలు ప్రకటన చేసిన సమయంలో నేను హైదరాబాదులో ఉన్నాను. ఆదివారం నెల్లూరుకు వస్తున్నా. నాపై ఎంతో నమ్మకం ఉంచి మొట్టమొదటగా జిల్లాలో పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు.

అభినందనలు
వై.ఎస్.ఆర్ పార్టీ జిల్లా కన్వినర్ గా ఎన్నుకొనబడిన సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గోవర్థన్ అన్న అభిమానుల నుండి అభినందనలు.
Monday, May 23, 2011
విద్యార్థులను అభినందించిన కాకాణి
మండలం లోని వరదాపురం సాయినాథ్ హైస్కూల్ విద్యార్థులు పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో మందల స్థాయిలో ప్రతిభ కనిపరిచారు. కందమూరు గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య కుమార్తె కవిత 578 మార్కులు సాధించి మందల ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో జిల్లా పరిషత్ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, పాటశాల కరస్పండంట్ డి మురళి కృష్ణ రెడ్డి, ప్రిన్సిపాల్ డి శ్రీనివాసుల రెడ్డి, సిబ్బంది ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించారు.
ఆంధ్ర హాకీ జట్టుకు జాతీయస్థాయి గుర్తింపు తేవాలి-కాకాణి
ఆంధ్ర హాకీ జట్టుకు జాతీ యస్థాయి గుర్తింపు తేవాలని అసోసియేషన్ సభ్యులకు జిల్లా పరిషత్ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి సూచించారు. ఆదివారం స్థానిక కొండాయపాళెం బాలుర వసతి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఛైర్మన్ మాట్లాడుతూ ఈ నెల 20 నుండి నేటివరకు ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన సబ్ జూనియర్ బాలుర ఇంటర్ జిల్లా హాకీ ఛాంపియన్‌షిప్ పోటీలను దిగ్విజ యంగా నిర్వహించిన హాకీ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ప్రస్తుతం ఉన్న 30 మంది ఆటగాళ్ళ లో సెలక్షన్ కమిటీ సభ్యులు 18 మంది ఆటగాళ్ళను ఎంపికచేసి ఈ నెల 28 నుండి బొంబాయిలో జరగనున్న అంతర్జాతీయ హాకీలో పాల్గొంటారని తెలిపారు. వీరికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చేందుకు సభ్యులు తగు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఉత్తమ క్రీడాకా రులను మాత్రమే ఎంపికచేసి జాతీయ స్థాయిలో ఆంధ్రహాకీ జట్టు కీర్తిప్రతిష్టలు అందుకో వాల న్నదే తమ ప్రధాన ఉద్దేశమ న్నారు. ఆంధ్ర హాకీ అసోసియే షన్‌లో ఆధిపత్య పోరుకోసం ఎన్ని జరిగినా వీటిని సమర్ధ వంతంగాఎదుర్కొని ముందు కుసాగడమే తమ ప్రధాన ధ్యేయమన్నారు. సబ్ జూని యర్ హాకీ విజేతకు ఎన్నడూలేనివిధంగా ఈ దఫా మొద టి బహుమతి రూ.5000, రెండవ బహుమతి రూ. 3000 3,4 వ బహుమతులకు రూ. 1000 చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. పైసమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి ప్రసన్నకుమార్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, ఇసి మెంబర్ రత్నాకర్, సెలక్షన్ కమిటీ సభ్యులు ఎస్. సోమయ్య, మహమ్మద్ ఆరిఫ్, కోచ్ పి. లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)