ఏ హోదాలో ఉన్నప్పటికీ జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తన పయనం సాగతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధనరెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్‌గా నియమితులైన తర్వాత హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వచ్చిన కాకాణికి ఆదివారం పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. అదే రోజు సాయంత్రం కాకాణి తన నివాసంలో పలువురు పార్టీ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గడచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జెడ్పీ చైర్మన్‌గా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలనను అందించామన్నారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్‌రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో..జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తాను మహానేత వైఎస్సార్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచానన్నారు. మొట్టమొదటగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్‌గా తనకు బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
జిల్లాలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నాయకత్వంలో జిల్లాలోని అందరు నేతలు, కార్యకర్తలను కలుపుకుని గ్రామస్థాయి నుం చి పార్టీ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. జెడ్పీ చైర్మన్‌గా అధికారులతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేశానన్నారు. ఇకపై ఒక రాజకీయ పార్టీ జిల్లా సారథిగా ప్రజల సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగంతో గట్టిగా పోరాడుతానన్నారు. సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి ఉద్యమిస్తానని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో మనం చేయనిపని ఇతరులు చేయకూడదు అనే దురదృష్టకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని, తమ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు ఎవరు చేసినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కేవలం రాజకీయాల కోసం కాకుండా , పేదలకు మేలైన వ్యవస్థ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందన్నారు. జిల్లాలో కాంగ్రెస్, టీడీపీల పని అయిపోయిందని, రాబోయే రోజులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్డీవేనని ఆయన పేర్కొన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయనకుమారుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కానీ ప్రజలలోంచి పుట్టుకువచ్చిన నేతలని కాకాణి పేర్కొన్నారు. ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, జిల్లాలో ఏ ఎన్నికలు వచ్చినా తమ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, సీనియర్ నేత నేదురుమల్లి పద్మనాభరెడ్డి, మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, చిల్లకూరు సుధీర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ప్రవీణ్‌కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ నగళ్ల శ్రీనివాసులు, జెడ్పీటీసీ సభ్యులు వీరి చలపతి, భాస్కర్‌గౌడ్, వెంకయ్య, పాంగు రంగయాదవ్, రమణయ్య, శ్రీనివాసులు, మేకల లక్ష్మి, చిరంజీవిరెడ్డి మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్‌గా కాకాణిని నియమించడం పార్టీ విజయంలో తొలి అడుగుగా వారు అభివర్ణించారు. నిబద్ధత, నిజాయితీ కలిగిన నేత కాకాణి నాయత్వంలో పార్టీ విజయపథాన నడుస్తుం దనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తామందరం అయనకు సహకరించి పార్టీ అభివృద్ధికి పాటుపడతామన్నారు. జిల్లాలో ఎప్పుడు ఎన్ని కలు జరిగినా 10 అసెంబ్లీ స్థానాలనూ తమ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు గల్లంతవడం ఖాయమని జోస్యం చెప్పారు.
No comments:
Post a Comment