Monday, May 23, 2011
ఆంధ్ర హాకీ జట్టుకు జాతీయస్థాయి గుర్తింపు తేవాలి-కాకాణి
ఆంధ్ర హాకీ జట్టుకు జాతీ యస్థాయి గుర్తింపు తేవాలని అసోసియేషన్ సభ్యులకు జిల్లా పరిషత్ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి సూచించారు. ఆదివారం స్థానిక కొండాయపాళెం బాలుర వసతి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఛైర్మన్ మాట్లాడుతూ ఈ నెల 20 నుండి నేటివరకు ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన సబ్ జూనియర్ బాలుర ఇంటర్ జిల్లా హాకీ ఛాంపియన్‌షిప్ పోటీలను దిగ్విజ యంగా నిర్వహించిన హాకీ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ప్రస్తుతం ఉన్న 30 మంది ఆటగాళ్ళ లో సెలక్షన్ కమిటీ సభ్యులు 18 మంది ఆటగాళ్ళను ఎంపికచేసి ఈ నెల 28 నుండి బొంబాయిలో జరగనున్న అంతర్జాతీయ హాకీలో పాల్గొంటారని తెలిపారు. వీరికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చేందుకు సభ్యులు తగు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఉత్తమ క్రీడాకా రులను మాత్రమే ఎంపికచేసి జాతీయ స్థాయిలో ఆంధ్రహాకీ జట్టు కీర్తిప్రతిష్టలు అందుకో వాల న్నదే తమ ప్రధాన ఉద్దేశమ న్నారు. ఆంధ్ర హాకీ అసోసియే షన్‌లో ఆధిపత్య పోరుకోసం ఎన్ని జరిగినా వీటిని సమర్ధ వంతంగాఎదుర్కొని ముందు కుసాగడమే తమ ప్రధాన ధ్యేయమన్నారు. సబ్ జూని యర్ హాకీ విజేతకు ఎన్నడూలేనివిధంగా ఈ దఫా మొద టి బహుమతి రూ.5000, రెండవ బహుమతి రూ. 3000 3,4 వ బహుమతులకు రూ. 1000 చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. పైసమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి ప్రసన్నకుమార్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, ఇసి మెంబర్ రత్నాకర్, సెలక్షన్ కమిటీ సభ్యులు ఎస్. సోమయ్య, మహమ్మద్ ఆరిఫ్, కోచ్ పి. లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment