Pages

Sunday, May 29, 2011

కాంగ్రెస్‌కు కొమ్ము కాస్తున్న టీడీపీ


తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌ పార్టీకి కొమ్ము కాస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్‌, జడ్పీ ఛైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడ అధికారంలోకి వస్తారోనని టీడీపీ కాంగ్రెస్‌కు కొమ్ము కాస్తుందన్నారు. అధికారం ఉన్నా, లేకున్నా జనం నుంచి ఎదిగిన వ్యక్తి జగన్‌ అన్నారు. దివంగత నేత వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి రెక్కల కష్టంతో వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తాము కూల్చబోమన్నారు. వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని, వాటిని అన్నింటినీ అమలు చేసేది ఒక్క జగనేనన్నారు.

అయితే టీడీపీ దుష్ర్పచారానికి నాంది పలుకుతుందన్నారు. అలాగే డొంక తిరుగుడు సమాధానాలు ఇస్తున్నట్లు ఆయన దుయ్యపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వానిది మొండి వాదమని ఆయన విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో తమ పార్టీ అభ్యర్థి ఓడిపోయారని, అయితే తెలుగుదేశం పార్టీ ఉనికిని కోల్పోయిందని ఆయన విమర్శించారు. తాను అధికార ంలో ఉన్నా, లేకపోయినా ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడతానన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వానికి అధికారులు కొమ్ము కాసిన వారి మెడలు వంచుతామని హెచ్చరించారు. రైతు సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్‌గా నియమించిన పార్టీ అధ్యక్షునికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరినీ సమన్వయపరచుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. కావలి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాకాణి నాయకత్వంలో అందరం పని చేస్తామన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. జిల్లా గ్రంధాలయ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాకాణి మచ్చలేని వ్యక్తి అని, జడ్పీ ఛైర్మన్‌గా తన పదవీ కాలంలో ఎంతో అభివృద్ధి చేశారని ఆయన కొనియాడారు.

నేదురుమల్లి పద్మనాభరెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీకి మనుషులు కరువయ్యే అవకాశం ఉందని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టిన కాకాణి గోవర్థన్‌రెడ్డిని ఆయన నివాసంలో పుష్పగుచ్ఛాలు, కండువాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం, సుధీర్‌రెడ్డి, చిల్లకూరు జడ్పీటిసి లక్ష్మి, విడవలూరు, కలిగిరి జడ్పీటిసిలు వీరి చలపతి, మెట్టుకూరు చిరంజీవిరెడ్డి, జడ్పీటిసి గోగుల వెంకయ్య, టిపి.గూడూరు ఎంపిపి శ్రీనివాసులురెడ్డి, కావలి మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ నగ ళ్ల శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment