Pages

Sunday, May 29, 2011

కాకాణి ఎంపికపై ఉప్పొంగిన ఆనందం

కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్‌హాక్ కమిటీ జిల్లా కన్వీనర్‌గా జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి నియమితులు కావడంపై ఆయన స్వగ్రామమైన పొదలకూరు మండలం తోడేరు గ్రామస్తుల్లో ఆనందం తొణికిసలాడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కోసం వినూత్నమైన కార్యక్రమాలను కాకా ణి చేపట్టారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత కలిగిన నాయకుడిగా ఎదుగుతున్న గోవర్ధన్‌రెడ్డి రాబోయే రోజుల్లో తమ గ్రామానికి మరిన్ని మంచి పనులు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తోడేరులో కాకాణి సేవలు
రూ. 10 లక్షలతో పశువైద్యశాల,
రూ. 40 లక్షలతో జెడ్పీ హైస్కూల్,
రూ. 5 లక్షలతో మహిళా భవనం,
రూ. 10 లక్షలతో తాగునీటి ఓవర్‌హెడ్ ట్యాంకు,
రూ. 10 లక్షలతో రామమందిరం,
రూ. 14 లక్షలతో నాలుగు అంగన్‌వాడీ భవనాలు,
రూ. 8 లక్షలతో రెండు కమ్యూనిటీ భవనాలు,
రూ. 57 లక్షలతో తోడేరు-సంగం తారురోడ్డు,
రూ. కోటి 30 లక్షలతో తోడేరు-మరుపూరు రోడ్డు,
రూ. 80 లక్షలతో తోడేరు-ఉప్పుటూరు రోడ్డు,
పంచాయతీ పరిధిలోని తోడేరు, శాంతినగర్, రత్నగిరి, గిరిజనకాలనీల్లో 50 సిమెంట్ రోడ్లు,
రూ. 5 లక్షలతో పార్కు.

మాకు ఆయనే దేవుడు
మా గ్రామస్తులకు కంటికి కనిపించే దేవుడు గోవర్ధన్‌రెడ్డి. మాకు కావాల్సిన పనులన్నీ చేసి పెట్టాడు. మా గ్రామంలో ఇన్ని వసతులు సమకూరుతాయని మేం ఊహించలేదు.
తిరుపాలు యాదవ్, మాజీ ఉప సర్పంచ్

అపారమైన గౌరవం
గోవర్ధన్‌రెడ్డి తండ్రి కాకాణి రమణారెడ్డి అంటే మాకు అపారమైన గౌరవం. జెడ్పీ చైర్మన్‌గా ఆయన ఉన్నప్పుడే నేను సర్పంచ్‌గా ఉండడం నా అదృష్టం.
ఏనుగు శశిధర్‌రెడ్డి, సర్పంచ్

No comments:

Post a Comment