జిల్లాలో సహజ సంపద యథేచ్ఛగా దోపిడీకి గురవుతున్నా దాన్ని అరికట్టడంలో అధికారులు విఫలం చెందారని జిల్లా పరిషత్ చైర్మన్ కాకాణి గోవర్ధనరెడ్డి పేర్కొన్నారు. జెడ్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇసుక రవాణాలో జరిగిన అక్రమాలను సాక్ష్యాధారాలతో నివేదికను ఆయన మీడియాకు అందజేశారు. దశాబ్దాలుగా జిల్లాలో కొందరు పెద్దలు ఇసుక అక్రమ రవాణా చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారన్నారు. అధికారుల ఉదాశీనత వైఖరి వల్లనే స్థానిక సంస్థల ఆదాయానికి గండి పడిందన్నారు. పదేళ్లలో రూ. 100 కోట్ల ఆదాయాన్ని స్థానిక సంస్థలు కోల్పోయాయన్నారు.ఈ ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయడంలో మైనింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ ధనం దుర్వినియోగమవుతుంటే ఏసీబీ అధికారుల ఏం చేస్తున్నారని కాకాణి ప్రశ్నించారు.
జెడ్పీ నూతన కార్యాలయంపై చూపిన శ్రద్ధను ఇసుక రవాణాపై ఏసీబీ ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ఏసీబీ తన ఉనికినే కోల్పోయిందని ఘాటుగా విమర్శించారు. భూగర్భ జలాలకు నష్టం కలిగించే వారిపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో ఇసుక దోపిడీని అరికట్టినందు వల్లే జెడ్పీకి రూ.50 కోట్లు ఆదా యాన్ని రాబట్టినట్లు చెప్పారు.
జిల్లాలోని ముదివర్తిపాళెం,పోతిరెడ్డిపాళెం, పల్లిపాడు, జొన్నవాడ, మినగల్లు ప్రాంతాల్లో టెండర్లు పిలవాల్సి ఉందని, ఈ ప్రక్రియ పూర్తయితే మరో రూ. 10 కోట్ల ఆదాయం అదనంగా సమకూరుతుందన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికడితే ఏటా జెడ్పీకి రూ. 30 కోట్లకు పైగా ఆదాయం వస్తుందన్నారు. అయితే గడచిన ఎనిమిదేళ్లలో జెడ్పీకి రూ.13 కోట్లు మాత్రమే జమ కావడం బాధాకరమన్నారు. వేలం పాటల కమిటీలో జెడ్పీ సీఈఓను సభ్యునిగా చేర్చకపోవడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. పాలకులు పరిపాలనపై శ్రద్ధ చూపాలే తప్ప అధికారులను భయభ్రాంతులకు గురి చేయడం మంచిది కాదన్నారు. అధికారులపై ఒత్తిడి తేవడంతో విధులు సక్రమంగా నిర్వహించలేక పోతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని సమీక్షించి ,పూర్తి స్థాయిలో విచారణ జరిపి అవినీతికి పాల్పడ్డ వారిపై తగు చర్యలు తీసుకోవాలని కాకాణి డిమాండ్ చేశారు.
జెడ్పీ భవనాన్ని సకాలంలో పూర్తి చేస్తాం: జెడ్పీ నూతన భవనాన్ని సకాలంలో పూర్తి చేయిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికారులకు ఇబ్బంది కలిగే పరిస్థితి తలెత్తితే భవన నిర్మాణ పనులను నిలిపి వేస్తామన్నారు. రాజకీయంగా తలెత్తే ఇబ్బందులను తాను ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేశారు. న్యాయస్థానంలో ఉన్నందు వ ల్ల పనులు నిలిపేశామని కోర్టు తీర్పు వెలువడిన వెంటనే పనులు ప్రారంభిస్తామని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ సమావేశంలో జెడ్పీ వైఎస్ చైర్మన్ టీవీఎస్ రాజా,జెడ్పీటీసీ సభ్యులు వీరి చలపతి, చిరంజీవి రెడ్డి, జి.వెంకయ్య,జయచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tuesday, February 22, 2011
ఇసుక దోపిడీని అరికట్టడంలో విఫలం ... కాకాణి
Saturday, February 19, 2011
కాకాణిపై కక్షసాధింపు తగదు
నీతి, నిజాయితీ క్రమశిక్షణకు మారుపేరు జిల్లా పరిషత్ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి అని జగన్ వర్గీయులు, ముస్లిం నేతలు పేర్కొన్నారు. కేవలం జగన్ వెంట వెళ్తున్నాడన్న అక్కసుతో కాకాణిపై ఆనం సోదరులు క్షక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముస్లిం నేతలు ఆనం సోదరుల అవినీతిని ఎండగట్టారు. జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న గోవర్ధన్ రెడ్డిపై ఏసీబీ దాడులు, అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మైనార్టీ నాయకులు ఎస్కే షఫీ పేర్కొన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంజూరు చేసిన నెల్లూరు, సంగం బ్యారేజీ పనులు నత్తనడకన నడుస్తున్నాయన్నారు. నిద్రపోతున్న మంత్రి ఆనం దీనికి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నెల్లూరు బ్యారేజీ పనుల్లో ఆనం సోదరులు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నెల్లూరు, ఆత్మకూరు రహదారి దారుణంగా దెబ్బతింటే పట్టీపట్టనట్లు రామనారాయణ రెడ్డి వ్యవహరించడం శోచనీయమన్నారు. బుచ్చి రోడ్డు 30 ఏళ్లక్రితం బెజవాడగోపాల్ రెడ్డి హయాంలో వేశారని గుర్తుచేశారు. ప్రజాప్రయోజనాలు పట్టని ఆనం సోదరులకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతుకాక తప్పదని షఫీ జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో ముస్లి నాయకులు ఎస్కే బాబు, ఎస్కే వసీమ్, ఎస్కే జలీల్, ఎస్కే ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు బ్యారేజీ పనుల్లో ఆనం సోదరులు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నెల్లూరు, ఆత్మకూరు రహదారి దారుణంగా దెబ్బతింటే పట్టీపట్టనట్లు రామనారాయణ రెడ్డి వ్యవహరించడం శోచనీయమన్నారు. బుచ్చి రోడ్డు 30 ఏళ్లక్రితం బెజవాడగోపాల్ రెడ్డి హయాంలో వేశారని గుర్తుచేశారు. ప్రజాప్రయోజనాలు పట్టని ఆనం సోదరులకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతుకాక తప్పదని షఫీ జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో ముస్లి నాయకులు ఎస్కే బాబు, ఎస్కే వసీమ్, ఎస్కే జలీల్, ఎస్కే ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
నా పని తీరుపై ప్రజలదే అంతిమ తీర్పు...
జిల్లా పరిషత్ చైర్మన్ గా నేను పనిచేసిన విధానం, నా పనితీరుపై ప్రజలే తీర్పు చెపుతారని, ప్రజలు ఈవిధమైన తీర్పు ఇచ్చినా కట్టుబడి వుంటాను, ప్రజలు తప్పుచేశానని తీర్పు ఇస్తే నా శ్వాస ఆగిపోతుందని, అందుకే ప్రజా తీర్పు ఏదైనా దానికి తను సిద్దమని జెడ్.పి. చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి 12 వతేది నెల్లూరు జిల్లా పరిషత్ హాల్ నందు జరిగిన విలేకరులు సమావేశం లో అన్నారు. 5 సవత్సరాల పాలనలో 40 కోట్లతో పనులు చేయిస్తే 200 కోట్ల అవినీతి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఏ.సి.బి దాడులను తానూ వ్యతిరేఖించడం లేదని అలాగే సి.బి.ఐ. వారిచే కుడా పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తానని కాకాణి అన్నారు.
5 ఏళ్ళ పాలనలో విలువలు, సంప్రదాయాలు పాటిస్తూ పరిపాలన చేస్తూ, జెడ్.పి. కి నూతన భవనం అవసరమని దివంగతనేత డాక్టర్ వై.ఎస్.ఆర్ ని కోరగా ఆయన వెంటనే కోటి రూపాయలను విడుదల చేసారు. తరువాత ఆయన మృతితో ఆ నిధులు ఆగిపోయాయి. దాంతో ఇసుక రిచ్లద్వార వచ్చిన 3 కోట్ల రూపాయలు భావన నిర్మాణానికి ఖర్చు చేయాలనీ భావించగా, దానికి ప్రభుత్వం అనుమతించింది. గతం లో జిల్లపరిసత్కు సంవత్సరానికి 3 కోట్ల ఆడం వస్తున్దేదని, తను పదవిభాద్యతలు చేపట్టిన తరువాత ఇసుక మాఫియలను తరిమికొట్టడం ఈరోజు ఆదాయం 7 కోట్లకు పెరిగిందని పెర్ఖొన్నారు. ఇందులో ఏదైనా తప్పు జరిగినత్లీ రుజువుచేస్తే దానికి పూర్తిస్థాయిలో భాద్యత వహిస్తానని, ఏ.సి.బి కన్నా సి.బి.ఐ. చేత విచారణ చేయించాలని తానూ స్వయంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తానన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం భావన నిర్మాణం ఆపి వేస్తున్నాం. ఆదిపత్యం కోసం ఇంతటి నీచ రాజకేయం చెయ్యడం తగదని, తాను మొదట నుండి ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్నానని, భావిష్యతులో కుడా అలాగే పనిచేస్తానని కాకాణి అన్నారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టిన జగన్ తో నడక ఆపేది లేదని కాకాణి స్పష్టం చేసారు.
లాయర్ తెలుగు వార పత్రిక వారి సౌజన్యం తో...
5 ఏళ్ళ పాలనలో విలువలు, సంప్రదాయాలు పాటిస్తూ పరిపాలన చేస్తూ, జెడ్.పి. కి నూతన భవనం అవసరమని దివంగతనేత డాక్టర్ వై.ఎస్.ఆర్ ని కోరగా ఆయన వెంటనే కోటి రూపాయలను విడుదల చేసారు. తరువాత ఆయన మృతితో ఆ నిధులు ఆగిపోయాయి. దాంతో ఇసుక రిచ్లద్వార వచ్చిన 3 కోట్ల రూపాయలు భావన నిర్మాణానికి ఖర్చు చేయాలనీ భావించగా, దానికి ప్రభుత్వం అనుమతించింది. గతం లో జిల్లపరిసత్కు సంవత్సరానికి 3 కోట్ల ఆడం వస్తున్దేదని, తను పదవిభాద్యతలు చేపట్టిన తరువాత ఇసుక మాఫియలను తరిమికొట్టడం ఈరోజు ఆదాయం 7 కోట్లకు పెరిగిందని పెర్ఖొన్నారు. ఇందులో ఏదైనా తప్పు జరిగినత్లీ రుజువుచేస్తే దానికి పూర్తిస్థాయిలో భాద్యత వహిస్తానని, ఏ.సి.బి కన్నా సి.బి.ఐ. చేత విచారణ చేయించాలని తానూ స్వయంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తానన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం భావన నిర్మాణం ఆపి వేస్తున్నాం. ఆదిపత్యం కోసం ఇంతటి నీచ రాజకేయం చెయ్యడం తగదని, తాను మొదట నుండి ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్నానని, భావిష్యతులో కుడా అలాగే పనిచేస్తానని కాకాణి అన్నారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టిన జగన్ తో నడక ఆపేది లేదని కాకాణి స్పష్టం చేసారు.
లాయర్ తెలుగు వార పత్రిక వారి సౌజన్యం తో...
Tuesday, February 15, 2011
జడ్పీలో అవినీతి జరగలేదు అఖిలపక్ష సమావేశంలో చైర్మన్ కాకాణి స్పష్టం
జిల్లా పరిషత్‌లో అవినీతి జరిగిన విషయంలో తాను సంతకాలు చేసిన ఫైళ్లలో ఎక్కడా ఒక్క రూపాయి కూడా అవినీతి జరుగలేదని జడ్పీ చైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన అఖిల పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్‌కు సంబంధించి కేవలం 50లక్షల రూపాయల నిధులు మాత్రమే విడుదలచేసినట్టు ఇటీవల టిడిపి జిల్లా అధ్యక్షులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారని, అయితే నిజానికి 4 కోట్ల 51లక్షల, 81 వేల రూపాయలు విడుదల చేశామన్నారు. జడ్పీపై వచ్చిన అవినీతి ఆరోపణల్లోని నిజానిజాలను నిగ్గు తేల్చాలనే ఉద్దేశ్యంతో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశామని కాకాణి తెలిపారు. అవినీతి ఆరోపణలు చేస్తున్న వారికి ఫైల్స్ చూపించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పముజుల దశరథరామయ్య జడ్పీ భవన నిర్మాణం, ఎన్ఆర్ఇజిఎస్ పనుల గురించి వివరించాలని కోరారు. ఇందుకు కాకాణి స్పందిస్తూ జడ్పీ భవన నిర్మాణానికి సంబంధించి గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కోటి రూపాయలు మంజూరు చేశారని, అయితే దురదృష్టవశాత్తు నిధులు విడుదల చేయకుండానే ఆయన మరణించారన్నారు. దీంతో జిల్లాలోని ఇసుక రవాణాను అడ్డుకుని 3కోట్ల రూపాయలతో భవన నిర్మాణాన్ని ప్రభుత్వ అనుమతితో చేపట్టామన్నారు. కొందరు తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు పోలీసులు, ఎసిబి అధికారులచేత విచారణ జరిపించారన్నారు. శుక్రవారం లోపు జడ్పీ భవన నిర్మాణానికి సంబంధించిన బిల్లులను ఎందుకు ఆపారో సమాధానం చెప్పాలని న్యాయ స్థానం కోరిందని, హైకోర్టు ఉత్తర్వుల మేరకు తిరిగి పనులు ప్రారంభిస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఇజిఎస్ గ్రామస్థాయిలో గుర్తించిన పనులకు జడ్పీ సమావేశంలో ఆమోదం పొందిన తర్వాత జిల్లా కలెక్టర్ వద్దకు ఫైల్ చేరుస్తామన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా ఎంపిడిఓలపై చర్య తీసుకునే అధికారం తనకు లేదని జిల్లా కలెక్టర్ మాత్రమే చర్యలు తీసుకోగలుగుతారని చెప్పారు. జడ్పీ తీర్మానం చేసిన పనులు కూడా ఇన్చార్జ్ మంత్రులు చూస్తారని ప్రభుత్వం కొత్తగా నిబంధనలు విధించిందన్నారు. ఉపాధి హామీ పథకంలో అవినీతి జరుగుతోందని ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియచేస్తే, రాష్ట్రప్రభుత్వం జిల్లా కలెక్టర్‌కు లేఖ రాస్తుందని, తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎంపిడిఓలను బదిలీ చేసే అధికారం మాత్రమే జడ్పీ చైర్మన్‌కు ఉంటుందని చెప్పారు. ఎక్కడా అవినీతికి స్థానం లేకుండా జడ్పీకి సంబంధించి అనేక కార్యక్రమాలు చేశామన్నారు. రెండు సమావేశాల్లో వివాదాలు చోటుచేసుకున్నాయన్నారు. తన స్వంత నియోజకవర్గం సైదాపురంకు ఎక్కువ నిధులు కేటాయించామని కొందరు జడ్పీ సమావేశాల్లో విమర్శిస్తున్నారన్నారు. గతంలో ఇసుక రీచ్‌లకు జడ్పీ చైర్మన్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థల చైర్మన్‌గా తనతోపాటు కలెక్టర్ ఉండేవారని, అయితే ప్రస్తుతం రీచ్‌లకు జాయింట్ కలెక్టర్, క్రీడా ప్రాధికార సంస్థకు కలెక్టర్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారన్నారు. అవినీతి జరుగకూడదు, అభివృద్ధి జరగాలనే కోరుకునే వారిలో తాను కూడా ఒకడినని కాకాణి తెలిపారు. బిజెపి జిల్లా అధ్యక్షులు కర్నాటి ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ కాకాణి జడ్పీ చైర్మన్ అయిన తర్వాత పరిపాలన బాగుందని ప్రశంసించారు. నిజాయితీగా అన్ని ఫైళ్లను సమావేశంలో చూపించడాన్ని ఆయన అభినందించారు. కార్పొరేషన్, విఆర్ కళాశాలలో అనేక అరోపణలు వచ్చాయని, జిల్లా మంత్రి కూడా ఇదేవిధంగా తమ నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జక్కా వెంకయ్య మాట్లాడుతూ చైర్మన్‌పై అవినీతి ఆరోపణలు లేవన్నారు. సోషల్ ఆడిట్‌పై చర్యలు తీసుకునే అధికారం జడ్పీ చైర్మన్‌కు లేదన్నారు. కాకాణి నిజాయితీని జక్కా అభినందించారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి మాట్లాడుతూ ఎన్ఆర్ఇజిఎస్ పనుల్లో ఎక్కడ అవినీతి జరిగిందో వాటిపై చర్యలు తీసుకోవచ్చుకదా అని ప్రశ్నించారు. ఇందుకు కాకాణి స్పందిస్తూ తనకు ఎంపిడిఓలపై చర్యలు తీసుకునే అధికారం లేదన్నారు. ఎన్ఆర్ఇజిఎస్ పనుల్లో అవినీతి జరిగిందని గత రెండేళ్లుగా పోరాడుతున్నామని, కానీ ఇందుకు ఎవరూ స్పందించలేదని, అంతర్గత రాజకీయాల వల్లే అవినీతి బయటకు వచ్చిందన్నారు. సమావేశంలో నెల్లూరు నగర మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, లోక్‌సత్తా జిల్లా అధ్యక్షులు నర్రా శ్రీ్ధర్, జడ్పీటిసిలు నారపరెడ్డి, వీరి చలపతి తదితరులు పాల్గొన్నారు.
Monday, February 14, 2011
జిల్లా అభివృద్ధికి నిదర్శనం కాకాణి...
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా మన జిల్లాలో అభివృద్ధి పయనంలో నడిపించిన వ్యక్తి కాకాణి గోవర్ధన్రెడ్డని కలువాయి మండలం మాజీ ఎంపీపీ బులగాకుల అనీల్‌కుమార్‌రెడ్డి పేర్కొనానరు.సోమవారం ఆయన స్వగ్రృహంలో పార్టీలకు అతీతంగా 10 మంది సర్పంచ్‌లతో, కాంగ్రెస్‌పార్టీ నాయకులతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాకు వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించిన వ్యక్తి జడ్పీచైర్మన్ కాకాణి అని తెలిపారు. విద్యార్థులకు రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జడ్పీచైర్మన్ తన సొంత నిధులతో విద్యార్థి అభివృద్ధికి ఖర్చుపెట్టిన వ్యక్తి కాకాణి అని తెలిపారు.అదేవిధంగా జిల్లాలో ఆస్పత్రుల్లో అభివృద్ధికి కృషిచేసిన ఘనత మన చైర్మన్దేనన్నారు.
జిల్లాలో నిధులు తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ అభివృద్ధిని చూపించిన ఘనత కూడా అతనిదే అన్నారు.సంవత్సరానికి జిల్లా పరిషత్‌కు రూ.20కోట్లు నిధులు వస్తుంటే, ఐదు సంవత్సరాలకు కలిపినాకూడా రూ.100కోట్లు రాగా అందుకు విరుద్దంగా 200కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రతిసంవత్సరం జిల్లాలో రూ.30లక్షలు తన సొంత నిధుల నుండి ఖర్చుపెడుతున్న మహోన్నతవ్యక్తి కాకాణి గోవర్ధన్రెడ్డని వారు పేర్కొన్నారు. కలువాయి మండలంలో మంచినీటి దాహార్తికి కటకటలాడుతున్నారని అతని దృష్టికి తీసుకెళ్లగానే లక్షలాది రూపాయల నిధులను మంజూరు చేసి కనుపూరుపల్లి, కలువాయి, కోటూరుపల్లి, చవటపల్లి, దాచూరు గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చిన వ్యక్తి జడ్పీచైర్మన్ అని పేర్కొన్నారు.
అలాంటి వ్యక్తిపై విమర్శలు చేయడం సూర్యునిపై ఉమ్మివేయడమేనన్నారు. ఇకనైనా ఇటువంటి అవినీతి ఆరోపణలు చైర్మన్‌పై మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో తాగునీటి సంఘ అధ్యక్షులు మాచిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, ఎంపిటీసి సభ్యులు బత్తులపల్లి ఆదినారాయణరెడ్డి, ఎం పద్మమ్మ, సర్పంచ్‌లు పటాపంచల కృష్ణయ్య, చింతంరెడ్డి రమణారెడ్డి, జగదల్‌నాయుడు, పి పెంచలమ్మ, కె అనిత, దేవరాల నరహిసంహులు, కాంగ్రెస్‌పార్టీ మండల కన్వీనర్ చల్లా రాఘవరెడ్డి, కాంగ్రెస్‌పార్టీ నాయుకులు చల్లా జయరామిరెడ్డి, చింతలపాళెం మస్తాన్, చిన్న అంకయ్యలు ఉన్నారు
జిల్లాలో నిధులు తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ అభివృద్ధిని చూపించిన ఘనత కూడా అతనిదే అన్నారు.సంవత్సరానికి జిల్లా పరిషత్‌కు రూ.20కోట్లు నిధులు వస్తుంటే, ఐదు సంవత్సరాలకు కలిపినాకూడా రూ.100కోట్లు రాగా అందుకు విరుద్దంగా 200కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రతిసంవత్సరం జిల్లాలో రూ.30లక్షలు తన సొంత నిధుల నుండి ఖర్చుపెడుతున్న మహోన్నతవ్యక్తి కాకాణి గోవర్ధన్రెడ్డని వారు పేర్కొన్నారు. కలువాయి మండలంలో మంచినీటి దాహార్తికి కటకటలాడుతున్నారని అతని దృష్టికి తీసుకెళ్లగానే లక్షలాది రూపాయల నిధులను మంజూరు చేసి కనుపూరుపల్లి, కలువాయి, కోటూరుపల్లి, చవటపల్లి, దాచూరు గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చిన వ్యక్తి జడ్పీచైర్మన్ అని పేర్కొన్నారు.
అలాంటి వ్యక్తిపై విమర్శలు చేయడం సూర్యునిపై ఉమ్మివేయడమేనన్నారు. ఇకనైనా ఇటువంటి అవినీతి ఆరోపణలు చైర్మన్‌పై మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో తాగునీటి సంఘ అధ్యక్షులు మాచిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, ఎంపిటీసి సభ్యులు బత్తులపల్లి ఆదినారాయణరెడ్డి, ఎం పద్మమ్మ, సర్పంచ్‌లు పటాపంచల కృష్ణయ్య, చింతంరెడ్డి రమణారెడ్డి, జగదల్‌నాయుడు, పి పెంచలమ్మ, కె అనిత, దేవరాల నరహిసంహులు, కాంగ్రెస్‌పార్టీ మండల కన్వీనర్ చల్లా రాఘవరెడ్డి, కాంగ్రెస్‌పార్టీ నాయుకులు చల్లా జయరామిరెడ్డి, చింతలపాళెం మస్తాన్, చిన్న అంకయ్యలు ఉన్నారు
Thursday, February 10, 2011
కాకాణిపై ఆరోపణలు ఆనం దిగజారుడుకు నిదర్శనం
నిజాయితీపరుడు, ఉత్తమ జిల్లా పరిషత్ ఛైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేయడం పట్ల ఆనం సోదరులు రాజకీయంగా దిగజారినట్లు స్పష్టం అవుతోంది. వైఎస్.జగన్మోహన్రెడ్డి వెంట నడిచేందుకు కాకాణి తీసుకున్న నిర్ణయం వల్ల జిల్లాలో కాంగ్రెస్‌పార్టీకి ఊహించని దెబ్బ తగిలిందన్నారు. దీంతో కాకాణి వెంట పెద్ద సంఖ్యలో జడ్పీటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, వేలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లడాన్ని ఆనం సోదరులు జీర్ణించుకోలేక పోతున్నారు. దీనిని సహించలేని మంత్రి ఆనం కాకాణిని రాజకీయంగా ఎదుర్కోలేక తన అనుచరులతో ఆయనపై లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారు. ఆయనను లక్ష్యంగా చేసుకుని వారు చేయిస్తున్న ఎసిబి దాడులకు ఎవరు భయపడే పరిస్థితుల్లో లేరని వాళ్ళు తెలుసుకోవాలి. జగన్‌వెంట నడిచే నేతలపట్ల ఆనం సోదరులు రాజకీయ కక్షలతో చేస్తున్న అరాచకాలకు జిల్లా ప్రజలు శిక్షించే రోజు ఎంతో దూరంలో లేదని ప్రజల అభిప్రాయం...
ఏసీబీ దాడుల్లో రాజకీయ ప్రమేయం లేదు... నమ్మొచ్చా ???
నాలుగు రోజులుగా జిల్లాలోని పలు ఎంపీడీఓ కార్యాలయాలపై జరుగుతున్న ఏసీబీ దాడుల విషయంలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. కేవలం ఏసీబీ అధికారులకు అందిన ఫిర్యాదులు, ఆరోపణల మేరకే ఈ దాడులు జరుగుతున్నాయన్నారు. అంతేగాని ఈ దాడుల వెనుక రాజకీయ ప్రమేయం ఉందనడాన్ని ఆయన కొట్టిపారే శారు.
నమ్మొచ్చా ??? మీ అభిప్రాయాలు తెలుపగలరు ?
Wednesday, February 9, 2011
కాకాణిని విమర్శించడం హాస్యాస్పదం
జిల్లాలో విద్యా, వైద్య, క్రీడారంగాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న జడ్పీఛైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి అవినీతిపరుడని విమర్శించడం హాస్యాస్పదమని గండవరం ఎంపిటిసి సభ్యులు ఎ.మోహన్‌కృష్ణ అన్నారు. బుధవారం గ్రామంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పలు రంగాల అభివృద్ధికి తన సొంత నిధులను వెచ్చిస్తున్న కాకాణి రూ.200 కోట్ల అవినీతికి పాల్పడ్డారనడం దారుణమన్నారు. జడ్పీ పీఠానికే వన్నె తెచ్చిన కాకాణిని విమర్శించే వారు పుట్టగతులు లేకుండా పోతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉపసర్పంచ్ కొండా శ్రీనివాసులురెడ్డి, దామేగుంట సర్పంచ్ శేషగిరిరావులు మాట్లాడుతూ గురగురవిందా.. అంటే చూసుకో నీ కింద... అన్నట్లు నిజాయితీపరులంటే ఆనం వర్గానికి గిట్టదన్నారు.జిల్లావ్యాప్తంగా కాకాణికి లభిస్తున్న జనాధరణను చూసి ఓర్వలేక నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఎవరు అవినీతిపరులో ప్రజలందరికి తెలుసన్నారు. ఇకనైనా సత్యదూరమైన ఆరోపణలను మాట్లాడడం మానుకోవాలని ఆనం వర్గానికి వారు హితవుపలికారు.
Tuesday, February 8, 2011
పక్కా ప్రణాళికతో దాడులు జరుపుతున్నారు, ఎవరిని భయపెట్టడానికి... ?
జిల్లాలో జెడ్పీ, ఎంపీడీఓ కార్యాలయాలపై ఏసీబీ ‘రాజకీయ’దాడులు రెండో రోజూ కొనసాగాయి. మంగళవారం మధ్యాహ్నం నుం చి సాయంత్రం వరకూ గూడూరు, నాయుడుపేట ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని జిల్లాలోని అధికార పార్టీ పెద్దల కనుసన్నల్లో సోమ వారం ఏసీబీ తనిఖీలు నిర్వహించగా, మంగళవారం మాత్రం జెడ్పీ చైర్మన్ అనుచరులను భయపెట్టే ప్రయత్నంలో భాగంగా తనిఖీలను కొనసాగించినట్లు స్పష్టమవుతోంది. గూడూరు, నాయుడుపేట ఎంపీపీలు ఇద్దరూ జెడ్పీ చైర్మన్ అనుచరులు కావడం గమనార్హం.
ఎవరిని భయపెట్టడానికి చేస్తున్నారు ఈ దాడులు ???
ఎవరిని భయపెట్టడానికి చేస్తున్నారు ఈ దాడులు ???
వుద్దేస్య పురకంగా ఏ.సి.బి దాడులు ...
యువనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతు ప్రకటించిన నెల్లూరు జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని జిల్లాలో రెండు రోజులుగా ఏసీబీ దాడులు సాగుతున్నాయి. సోమవారం నెల్లూరులో నిర్మాణంలో ఉన్న జెడ్పీ నూతన భవనాన్ని, కార్యాలయంలోని పలు రికార్డులను తనిఖీ చేసిన ఏసీబీ అధికారులు మంగళవారం జిల్లాలోని గూడూరు, నాయుడుపేట ఎంపీడీవో కార్యాలయాలపై దాడులు చేశారు. కాకాణి సొంత మం డలం పొదలకూరు, ప్రాతినిధ్యం వహిస్తున్న సైదాపురం ఎంపీడీవో కార్యాలయాలపై కూడా దాడులు నిర్వహించారు. జెడ్పీ ఆధ్వర్యంలో జరిగిన ఉపాధి హామీ పనులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల రికార్డులను తనిఖీ చేశారు. కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
జెడ్పీ ఆధ్వర్యంలో జరిగిన పలు అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగాయని తమకు ఫిర్యాదులు వచ్చాయని, ఉన్నతాధికారుల నుంచి తమకు ఆదేశాలు రావడంతోనే తనిఖీలు చేస్తున్నామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాకు చెందిన అధికార నేతల కనుసన్నల్లోనే ఈ దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది. జిల్లాలోని ముఖ్యనేతలంతా జననేత జగన్‌మోహన్‌రెడ్డివైపే నిలిచారు. ఇది అధికార పార్టీలోని సోదరులకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ దాడులు చేయించినట్లు ప్రజలు భావిస్తున్నారు. జెడ్పీ భవన నిర్మాణానికి రూ. 60 లక్షల సొంత నిధులు ఇచ్చిన కాకాణిపై బురదజల్లేలా సాగుతున్న ఈ పరిణామాలను చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కటి నిజం, కాకాణి గారు ఎంత పనివాడో, మంచి వాడో అందరికి తెలిసిన విషయమే. దీని వెనక ఎవరు వున్నారో ప్రజలకు అర్తం అవుతుంది. దయచేసి ఈ దాడులు చేస్తున్న, చేయిస్తున్న పెద్ద మనుషులు ఆపడం మంచిది. మీరు ఇటువంటివి చేసేకొద్దీ, చేయించే కొద్ది, మిమ్మల్ని మీరే గోతిలో వేసుకున్నట్లే. ఒకసారి పునరాలోచించుకోండి.
Monday, February 7, 2011
Sri Kakani Govardhan Reddy, the Chairperson, Zilla Praja Parishad, Nellore hailed from a well reputed peasant family of Thoderu village in Podalakur Mandal of Nellore district. His father Sri Kakani Ramana Reddy admired by the thought of Sampoorna Grama Swaraj introduced by Pandit Jawaharlal Nehru and took active part during the inception of Panchayat Raj system in Andhra Pradesh. He served as the President of the then Podalakur, Panchayat Samithi for an uninterrupted period of 18 years and has dedicated his services to the cause of down trodden and weaker section of the villages under his jurisdiction.
Sri Govardhan Reddy, having such a political and family social back ground was a good academician and did his Bachelor Degree in Civil Engineering from Mysore University. As a professional Civil Engineer, he is a reputed Civil Contractor by profession. Having a great flair to serve the needy people, he entered in politics and was elected unanimously to the post of Member Z.P.T.C., Sydapuram Mandal representing the Indian National Congress during the year 2006.
After his election as Chairperson, Zilla Praja Parishad, Nellore Sri Govardhan Reddy has taken up a number of social welfare measures towards meeting the aspirations of the people, particularly the rural population of the district with special reference to their developmental needs. He is a committed social worker and a philanthropist. He is determined to leave his mark on the institution of the Zilla Praja Parishad, Nellore.
Achievements
In a very short span his tenure as Chairman, Zilla Praja Parishad, Nellore, he has acquired a good command over the different feels of activities dealt by the Zilla Praja Parishad. He has concentrated district developmental activities and has conducted regular reviews with all the officers of Panchayat Raj and Rural Water Supply Engineering Wings, Education, Health, Agriculture, Animal Husbandary, S.C. Welfare, B.C. Welfare, Tribal Welfare, Marketing, Rythu Bazars, Fisheries, Social Forestry Departments and is ensuring to improve the quality of services delivered by these departments in the rural areas.
He is making efforts to provide potable drinking water to all the S.C., S.T. habitations in the district. 224 No. of S.T. habitations have been provided with protected water supply to date and the Chairman is striving to see that no S.C., S.T. habitations are lacking in protected water supply by the end of 2008.
In the field of Education he is helping to set high standards in the Z.P.P. High Schools and took the initiative towards providing quality furniture to the schools by allocating a part of the three years proceeds of the sand auction of Rs.3.00 Crores in the district in combination with the funds provided by the alumni associations of Z.P.P. High Schools.
As a philanthropist some of his gestures in committing his own personal financial resources towards larger societal good include, among other things:
- Provision of tri-cycles and other aids to physically handicapped people.
- Institution of 1st, 2nd and 3rd prizes in cash for meritorious students passing out of Class – X from the Z.P.P. High Schools of Nellore District : Every student who gets any one of the State rank in between 1 to 10 will get Rs.2,00,000/- as cash award. Students getting 1st, 2nd and 3rd Ranks at the District level will receive a cash prize of Rs.1,25,000/-, Rs.1,00,000/- and Rs.75,000/- respectively. For students getting the 1st, 2nd and 3rd Ranks at the Z.P.P. High Schools level Rs.1,00,000/-, Rs.75,000/- and Rs.50,000/- will be provided as cash prizes respectively.
- Encouraging sports in the district by organizing and financing the Chairman’s Cup sports event, thereby encouraging the physical fitness and enthusiasm for sports among the rural youth.
- Donating computers and needed furniture to the Government Hospitals in Nellore.
He has also voluntarily relinquished his honorarium as Chairman, Zilla Praja Parishad and the official vehicle which he is entitled to and donated the amounts saved therein to the cause of furthering the education of the children of Class-IV employees of the Zilla Praja Parishad.
Views
He has set for himself the following goals for achievement for the rest of his term :
a) Overall and comprehensive development of villages in all aspects.
b) Providing needed infrastructure facilities and teaching aids to all the Z.P.P. High Schools.
c) Provision of pucca roads drains and other infrastructure in rural areas.
d) Ensuring potable safe drinking water and improving hygiene in villages.
e) Initiating much needed changes in the day today running of hospital administration and ensure improvement of health care delivery to the patients in Government Hospitals in his capacity as Chairman, District Hospital Development Society, Nellore.
By his personal commitment to the peoples welfare, his liberal outlook, youthful profile, dynamism and earnestness in responding to the needs of the rural populace, he has endeared him self to all sections of the people and irrespective of party affiliation is commanding the respect and affection of the Members of the Zilla Praja Parishad.
Sri K. Govardhan Reddy is committed to improve values in public life and in administration and also make the best use of this opportunity as Chairman, Zilla Praja Parishad to serve the people of the District to the best of his ability for the reminder of his term and leave an indelible impression on the institution of the Zilla Praja Parishad, Nellore.
Subscribe to:
Posts (Atom)