Pages

Saturday, February 19, 2011

నా పని తీరుపై ప్రజలదే అంతిమ తీర్పు...

జిల్లా పరిషత్ చైర్మన్ గా నేను పనిచేసిన విధానం, నా పనితీరుపై ప్రజలే తీర్పు చెపుతారని, ప్రజలు ఈవిధమైన తీర్పు ఇచ్చినా కట్టుబడి వుంటాను, ప్రజలు తప్పుచేశానని తీర్పు ఇస్తే నా శ్వాస ఆగిపోతుందని, అందుకే ప్రజా తీర్పు ఏదైనా దానికి తను సిద్దమని జెడ్.పి. చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి 12 వతేది నెల్లూరు జిల్లా పరిషత్ హాల్ నందు జరిగిన విలేకరులు సమావేశం లో అన్నారు. 5 సవత్సరాల పాలనలో 40 కోట్లతో పనులు చేయిస్తే 200 కోట్ల అవినీతి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఏ.సి.బి దాడులను తానూ వ్యతిరేఖించడం లేదని అలాగే సి.బి.ఐ. వారిచే కుడా పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తానని కాకాణి అన్నారు.
5 ఏళ్ళ పాలనలో విలువలు, సంప్రదాయాలు పాటిస్తూ పరిపాలన చేస్తూ, జెడ్.పి. కి నూతన భవనం అవసరమని దివంగతనేత డాక్టర్ వై.ఎస్.ఆర్ ని కోరగా ఆయన వెంటనే కోటి రూపాయలను విడుదల చేసారు. తరువాత ఆయన మృతితో ఆ నిధులు ఆగిపోయాయి. దాంతో ఇసుక రిచ్లద్వార వచ్చిన 3 కోట్ల రూపాయలు భావన నిర్మాణానికి ఖర్చు చేయాలనీ భావించగా, దానికి ప్రభుత్వం అనుమతించింది. గతం లో జిల్లపరిసత్కు సంవత్సరానికి 3 కోట్ల ఆడం వస్తున్దేదని, తను పదవిభాద్యతలు చేపట్టిన తరువాత ఇసుక మాఫియలను తరిమికొట్టడం ఈరోజు ఆదాయం 7 కోట్లకు పెరిగిందని పెర్ఖొన్నారు. ఇందులో ఏదైనా తప్పు జరిగినత్లీ రుజువుచేస్తే దానికి పూర్తిస్థాయిలో భాద్యత వహిస్తానని, ఏ.సి.బి కన్నా సి.బి.ఐ. చేత విచారణ చేయించాలని తానూ స్వయంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తానన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం భావన నిర్మాణం ఆపి వేస్తున్నాం. ఆదిపత్యం కోసం ఇంతటి నీచ రాజకేయం చెయ్యడం తగదని, తాను మొదట నుండి ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్నానని, భావిష్యతులో కుడా అలాగే పనిచేస్తానని కాకాణి అన్నారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టిన జగన్ తో నడక ఆపేది లేదని కాకాణి స్పష్టం చేసారు.
లాయర్ తెలుగు వార పత్రిక వారి సౌజన్యం తో...

No comments:

Post a Comment