నీతి, నిజాయితీ క్రమశిక్షణకు మారుపేరు జిల్లా పరిషత్ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి అని జగన్ వర్గీయులు, ముస్లిం నేతలు పేర్కొన్నారు. కేవలం జగన్ వెంట వెళ్తున్నాడన్న అక్కసుతో కాకాణిపై ఆనం సోదరులు క్షక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముస్లిం నేతలు ఆనం సోదరుల అవినీతిని ఎండగట్టారు. జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న గోవర్ధన్ రెడ్డిపై ఏసీబీ దాడులు, అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మైనార్టీ నాయకులు ఎస్‌కే షఫీ పేర్కొన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంజూరు చేసిన నెల్లూరు, సంగం బ్యారేజీ పనులు నత్తనడకన నడుస్తున్నాయన్నారు. నిద్రపోతున్న మంత్రి ఆనం దీనికి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నెల్లూరు బ్యారేజీ పనుల్లో ఆనం సోదరులు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నెల్లూరు, ఆత్మకూరు రహదారి దారుణంగా దెబ్బతింటే పట్టీపట్టనట్లు రామనారాయణ రెడ్డి వ్యవహరించడం శోచనీయమన్నారు. బుచ్చి రోడ్డు 30 ఏళ్లక్రితం బెజవాడగోపాల్ రెడ్డి హయాంలో వేశారని గుర్తుచేశారు. ప్రజాప్రయోజనాలు పట్టని ఆనం సోదరులకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతుకాక తప్పదని షఫీ జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో ముస్లి నాయకులు ఎస్‌కే బాబు, ఎస్‌కే వసీమ్, ఎస్‌కే జలీల్, ఎస్‌కే ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment