Pages

Tuesday, February 8, 2011

పక్కా ప్రణాళికతో దాడులు జరుపుతున్నారు, ఎవరిని భయపెట్టడానికి... ?

జిల్లాలో జెడ్పీ, ఎంపీడీఓ కార్యాలయాలపై ఏసీబీ ‘రాజకీయ’దాడులు రెండో రోజూ కొనసాగాయి. మంగళవారం మధ్యాహ్నం నుం చి సాయంత్రం వరకూ గూడూరు, నాయుడుపేట ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని జిల్లాలోని అధికార పార్టీ పెద్దల కనుసన్నల్లో సోమ వారం ఏసీబీ తనిఖీలు నిర్వహించగా, మంగళవారం మాత్రం జెడ్పీ చైర్మన్ అనుచరులను భయపెట్టే ప్రయత్నంలో భాగంగా తనిఖీలను కొనసాగించినట్లు స్పష్టమవుతోంది. గూడూరు, నాయుడుపేట ఎంపీపీలు ఇద్దరూ జెడ్పీ చైర్మన్ అనుచరులు కావడం గమనార్హం.

ఎవరిని భయపెట్టడానికి చేస్తున్నారు ఈ దాడులు ???

No comments:

Post a Comment