Tuesday, February 8, 2011
వుద్దేస్య పురకంగా ఏ.సి.బి దాడులు ...
యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు ప్రకటించిన నెల్లూరు జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని జిల్లాలో రెండు రోజులుగా ఏసీబీ దాడులు సాగుతున్నాయి. సోమవారం నెల్లూరులో నిర్మాణంలో ఉన్న జెడ్పీ నూతన భవనాన్ని, కార్యాలయంలోని పలు రికార్డులను తనిఖీ చేసిన ఏసీబీ అధికారులు మంగళవారం జిల్లాలోని గూడూరు, నాయుడుపేట ఎంపీడీవో కార్యాలయాలపై దాడులు చేశారు. కాకాణి సొంత మం డలం పొదలకూరు, ప్రాతినిధ్యం వహిస్తున్న సైదాపురం ఎంపీడీవో కార్యాలయాలపై కూడా దాడులు నిర్వహించారు. జెడ్పీ ఆధ్వర్యంలో జరిగిన ఉపాధి హామీ పనులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల రికార్డులను తనిఖీ చేశారు. కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
జెడ్పీ ఆధ్వర్యంలో జరిగిన పలు అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగాయని తమకు ఫిర్యాదులు వచ్చాయని, ఉన్నతాధికారుల నుంచి తమకు ఆదేశాలు రావడంతోనే తనిఖీలు చేస్తున్నామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాకు చెందిన అధికార నేతల కనుసన్నల్లోనే ఈ దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది. జిల్లాలోని ముఖ్యనేతలంతా జననేత జగన్‌మోహన్‌రెడ్డివైపే నిలిచారు. ఇది అధికార పార్టీలోని సోదరులకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ దాడులు చేయించినట్లు ప్రజలు భావిస్తున్నారు. జెడ్పీ భవన నిర్మాణానికి రూ. 60 లక్షల సొంత నిధులు ఇచ్చిన కాకాణిపై బురదజల్లేలా సాగుతున్న ఈ పరిణామాలను చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కటి నిజం, కాకాణి గారు ఎంత పనివాడో, మంచి వాడో అందరికి తెలిసిన విషయమే. దీని వెనక ఎవరు వున్నారో ప్రజలకు అర్తం అవుతుంది. దయచేసి ఈ దాడులు చేస్తున్న, చేయిస్తున్న పెద్ద మనుషులు ఆపడం మంచిది. మీరు ఇటువంటివి చేసేకొద్దీ, చేయించే కొద్ది, మిమ్మల్ని మీరే గోతిలో వేసుకున్నట్లే. ఒకసారి పునరాలోచించుకోండి.
Subscribe to:
Post Comments (Atom)
ఎవరు ఎన్ని కుట్రలు చేసిన కాకాని గోవర్ధన్ గారు ని ఏమి చేయలేరు. కాకాని ఇస్ ది గ్రేట్ లీడర్
ReplyDelete