Pages

Monday, February 14, 2011

జిల్లా అభివృద్ధికి నిదర్శనం కాకాణి...

రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా మన జిల్లాలో అభివృద్ధి పయనంలో నడిపించిన వ్యక్తి కాకాణి గోవర్ధన్‌రెడ్డని కలువాయి మండలం మాజీ ఎంపీపీ బులగాకుల అనీల్‌కుమార్‌రెడ్డి పేర్కొనానరు.సోమవారం ఆయన స్వగ్రృహంలో పార్టీలకు అతీతంగా 10 మంది సర్పంచ్‌లతో, కాంగ్రెస్‌పార్టీ నాయకులతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాకు వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించిన వ్యక్తి జడ్పీచైర్మన్‌ కాకాణి అని తెలిపారు. విద్యార్థులకు రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జడ్పీచైర్మన్‌ తన సొంత నిధులతో విద్యార్థి అభివృద్ధికి ఖర్చుపెట్టిన వ్యక్తి కాకాణి అని తెలిపారు.అదేవిధంగా జిల్లాలో ఆస్పత్రుల్లో అభివృద్ధికి కృషిచేసిన ఘనత మన చైర్మన్‌దేనన్నారు.

జిల్లాలో నిధులు తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ అభివృద్ధిని చూపించిన ఘనత కూడా అతనిదే అన్నారు.సంవత్సరానికి జిల్లా పరిషత్‌కు రూ.20కోట్లు నిధులు వస్తుంటే, ఐదు సంవత్సరాలకు కలిపినాకూడా రూ.100కోట్లు రాగా అందుకు విరుద్దంగా 200కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రతిసంవత్సరం జిల్లాలో రూ.30లక్షలు తన సొంత నిధుల నుండి ఖర్చుపెడుతున్న మహోన్నతవ్యక్తి కాకాణి గోవర్ధన్‌రెడ్డని వారు పేర్కొన్నారు. కలువాయి మండలంలో మంచినీటి దాహార్తికి కటకటలాడుతున్నారని అతని దృష్టికి తీసుకెళ్లగానే లక్షలాది రూపాయల నిధులను మంజూరు చేసి కనుపూరుపల్లి, కలువాయి, కోటూరుపల్లి, చవటపల్లి, దాచూరు గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చిన వ్యక్తి జడ్పీచైర్మన్‌ అని పేర్కొన్నారు.

అలాంటి వ్యక్తిపై విమర్శలు చేయడం సూర్యునిపై ఉమ్మివేయడమేనన్నారు. ఇకనైనా ఇటువంటి అవినీతి ఆరోపణలు చైర్మన్‌పై మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో తాగునీటి సంఘ అధ్యక్షులు మాచిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, ఎంపిటీసి సభ్యులు బత్తులపల్లి ఆదినారాయణరెడ్డి, ఎం పద్మమ్మ, సర్పంచ్‌లు పటాపంచల కృష్ణయ్య, చింతంరెడ్డి రమణారెడ్డి, జగదల్‌నాయుడు, పి పెంచలమ్మ, కె అనిత, దేవరాల నరహిసంహులు, కాంగ్రెస్‌పార్టీ మండల కన్వీనర్‌ చల్లా రాఘవరెడ్డి, కాంగ్రెస్‌పార్టీ నాయుకులు చల్లా జయరామిరెడ్డి, చింతలపాళెం మస్తాన్‌, చిన్న అంకయ్యలు ఉన్నారు

No comments:

Post a Comment