Pages

Wednesday, February 9, 2011

కాకాణిని విమర్శించడం హాస్యాస్పదం

జిల్లాలో విద్యా, వైద్య, క్రీడారంగాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న జడ్పీఛైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి అవినీతిపరుడని విమర్శించడం హాస్యాస్పదమని గండవరం ఎంపిటిసి సభ్యులు ఎ.మోహన్‌కృష్ణ అన్నారు. బుధవారం గ్రామంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పలు రంగాల అభివృద్ధికి తన సొంత నిధులను వెచ్చిస్తున్న కాకాణి రూ.200 కోట్ల అవినీతికి పాల్పడ్డారనడం దారుణమన్నారు. జడ్పీ పీఠానికే వన్నె తెచ్చిన కాకాణిని విమర్శించే వారు పుట్టగతులు లేకుండా పోతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉపసర్పంచ్‌ కొండా శ్రీనివాసులురెడ్డి, దామేగుంట సర్పంచ్‌ శేషగిరిరావులు మాట్లాడుతూ గురగురవిందా.. అంటే చూసుకో నీ కింద... అన్నట్లు నిజాయితీపరులంటే ఆనం వర్గానికి గిట్టదన్నారు.జిల్లావ్యాప్తంగా కాకాణికి లభిస్తున్న జనాధరణను చూసి ఓర్వలేక నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఎవరు అవినీతిపరులో ప్రజలందరికి తెలుసన్నారు. ఇకనైనా సత్యదూరమైన ఆరోపణలను మాట్లాడడం మానుకోవాలని ఆనం వర్గానికి వారు హితవుపలికారు.

No comments:

Post a Comment