Pages

Thursday, February 10, 2011

కాకాణిపై ఆరోపణలు ఆనం దిగజారుడుకు నిదర్శనం

నిజాయితీపరుడు, ఉత్తమ జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేయడం పట్ల ఆనం సోదరులు రాజకీయంగా దిగజారినట్లు స్పష్టం అవుతోంది. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచేందుకు కాకాణి తీసుకున్న నిర్ణయం వల్ల జిల్లాలో కాంగ్రెస్‌పార్టీకి ఊహించని దెబ్బ తగిలిందన్నారు. దీంతో కాకాణి వెంట పెద్ద సంఖ్యలో జడ్పీటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, వేలాదిమంది కాంగ్రెస్‌ కార్యకర్తలు వెళ్లడాన్ని ఆనం సోదరులు జీర్ణించుకోలేక పోతున్నారు. దీనిని సహించలేని మంత్రి ఆనం కాకాణిని రాజకీయంగా ఎదుర్కోలేక తన అనుచరులతో ఆయనపై లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారు. ఆయనను లక్ష్యంగా చేసుకుని వారు చేయిస్తున్న ఎసిబి దాడులకు ఎవరు భయపడే పరిస్థితుల్లో లేరని వాళ్ళు తెలుసుకోవాలి. జగన్‌వెంట నడిచే నేతలపట్ల ఆనం సోదరులు రాజకీయ కక్షలతో చేస్తున్న అరాచకాలకు జిల్లా ప్రజలు శిక్షించే రోజు ఎంతో దూరంలో లేదని ప్రజల అభిప్రాయం...

No comments:

Post a Comment